Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేష్‌ అందుకు పనికి రారట.. జగన్‌, కేటీఆర్‌, చెర్రీ, తారక్‌లా?

Advertiesment
Nara lokesh
, మంగళవారం, 5 మే 2020 (16:16 IST)
సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా పనికి రాడని బండ్ల గణేష్ ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డాడు. 
 
"ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు కుమారుడిగా పుట్టడం మీ అదృష్టం. చంద్రబాబు కుమారుడిగా తప్ప మీకు రాజకీయంగా ఏ అర్హతా లేదు. నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్‌ నాయకులు. రాజకీయాల్లో మీరు రాణించలేరేమో అని భయమేస్తోంది. కానీ మీరు నెంబర్‌ వన్‌ కావాలని కోరుకుంటున్నా. 
 
మీ ట్వీట్‌ చూసి మిమ్మల్ని ఇష్టపడేవారు బాధపడుతున్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పోరాడారు. లోకేష్‌ తండ్రి చంద్రబాబు అని చెప్పేలా అద్భుతంగా పని చేయాలి. జగన్‌, కేటీఆర్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లా మీ తండ్రికి పేరు తేవాలి'' అని ట్విట్టర్‌లో లోకేష్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు.
 
ఇదిలా ఉంటే.. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా నారా లోకేష్ పట్ల అసంతృప్తిగా వున్నారని టాక్ వస్తోంది. టీడీపీకి బలమైన నాయకుడిగా ఎదిగే ఆలోచనలు లోకేశ్ చేయని పక్షంలో… అది మునిగిపోయే నావని, ఇక నందమూరి వారే ఆ నావను ఆదుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. 
 
లక్షల ప్రజాధనం ఖర్చుపెట్టి తెలుగు పాఠాలు చెప్పించుకున్నా కూడా.. తెలుగు మాట్లాడలేకపోవడం తెలుగుదేశం యువనాయకుడికి ఏమాత్రం మంచిది కాదనే కామెంట్లు కూడా వస్తున్నాయి. 
 
నారా లోకేశ్ రాజకీయాల్లోకి రావడం రావడమే మంత్రి కుర్చీ ఎక్కేసినా ఫలితం మాత్రం లేదు. తనకంటూ ఒక ఐడెంటిటీని ట్విట్టర్‌లో అయితే సంపాదించుకున్నారు కానీ రాజకీయాల్లో సంపాదించుకోవడంలో లోకేశ్ ఏమాత్రం కృషి చేయడం లేదనే కామెంట్లు వరుసగా వినిపిస్తున్నాయి.
 
నిజానికి కరోనా సమయాన్ని లోకేశ్ సరిగ్గా వాడుకుని ఉంటే, కార్యకర్తలకు ఎంతో భరోసా వచ్చేది. వయసు పైబడుతున్న చంద్రబాబు స్థానంలో పార్టీని నడపగలిగే వ్యక్తి వచ్చాడని నమ్మకం కలిగేది. కానీ… ఆ సమయంలో కూడా లోకేశ్ తన చిన్నపిల్ల చేష్టలతో కాలయాపన చేశారు తప్ప.. తన రాజకీయ కెరీర్‌పై దృష్టి పెట్టలేదు. 
 
లోకేశ్ ట్వీట్లు రోజు రోజుకీ కామెడీ అయిపోతున్నాయి. వీటికి ట్విట్టర్‌లోనే విజయసాయి రెడ్డి లాంటివారు కౌంటర్ ఇచ్చేసి.. వాటిని అక్కడే చంపేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఎదగని పక్షంలో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ పండితులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెట్వర్క్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ప్రారంభం