సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో శ్రీభరత్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని, ఒకవేళ ఆయన అవసరం ఉందనుకుంటే.. పార్టీలోకి ఆయన వచ్చే ఉద్దేశం వుంటే అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భరత్ వ్యాఖ్యానించారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు. ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే.
కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి (ఎన్టీఆర్) కూడా అనుకోవాలన్నారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచిదంటే తాను ఒప్పుకోనున్నారు. యువ నాయకులే కాస్త ప్రతిభ కనబరిచి కొత్త ఆలోచనలు చేయగలిగితేనే పార్టీని బలోపేతం చేసుకోవచ్చునని భరత్ వ్యాఖ్యానించారు.