Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

Advertiesment
man on car

ఐవీఆర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (20:43 IST)
వివాహేతర సంబంధాలు విషయంలో భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. ఐతే తాజాగా ఓ భర్త తన బైకుపై వెళ్తుండగా తన భార్య పరాయి పురుషుడితో కలిసి కారులో హ్యాపీగా వెళ్తుండటాన్ని చూసి కంగు తిన్నాడు. అంతే... అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
 
పూర్తి వివరాలను చూస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పరిధిలో వున్న కట్ఘర్ కొత్వాలికి చెందిన సమీర్ తన భార్యతో కలిసి నివాసం వుంటున్నాడు. తను విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా కారులో తన భార్య మరో యువకుడి మహీర్ అనే వ్యక్తి పక్కనే కూర్చుని కనబడింది. దీంతో షాకయిన సమీర్... కారును అడ్డుకునేందుకు బైకుతో వెంబడించాడు.
 
ఐతే మహీర్ కారును వేగంగా నడిపాడు. ఓ చోట రద్దీ ఎక్కువుండటంతో అకస్మాత్తుగా కారు బ్రేక్ వేయడంతో వెనకే వున్న సమీర్ బైకు కారుకి ఢీకొట్టి అతడు ఎగిరి కారు బానెట్ పైన పడ్డాడు. ఐనప్పటికీ బానెట్ పైన వుండి అద్దంపై వున్న వైపర్ ను గట్టిగా పట్టుకుని కారును ఆపాలంటూ కేకలు వేసాడు. ఐతే అదేమీ పట్టించుకోని మహీర్ కారును మరింత స్పీడుగా పోనిచ్చాడు. ఇదంతా రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు చూసి కారుని వెంబడించి కొంతదూరం తర్వాత అడ్డగించారు. రోడ్డుపై మహీర్ తో సమీర్ వాగ్వాదానికి దిగాడు. రోడ్డుపైన పెద్దఎత్తున జనం గుమికూడటంతో సమాచారం అందుకున్న పోలీసులు మహీర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే ప్రత్యక్ష ప్రదర్శనను ప్రసారం చేయనున్న డిస్నీ-హాట్‌స్టార్