Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే ప్రత్యక్ష ప్రదర్శనను ప్రసారం చేయనున్న డిస్నీ-హాట్‌స్టార్

Advertiesment
Coldplay Live

ఐవీఆర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (19:21 IST)
కోల్డ్‌ప్లేతో కలిసి వారి ఐకానిక్ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ కచేరీని భారతదేశం అంతటా ప్రేక్షకులకు ప్రత్యక్షంగా ప్రదర్శించడం ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వినోద అనుభవాలలో కొత్త ప్రమాణాలను డిస్నీ+ హాట్‌స్టార్ నెలకొల్పడానికి సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం నాడు అహ్మదాబాద్‌లో తమ అతిపెద్ద స్టేడియం ప్రదర్శనకు బ్యాండ్ సిద్ధమవుతున్నందున, ఈ వేదిక అధిక-నాణ్యత అనుభవాలకు అందరికీ చేరువ చేయడం ద్వారా వినోదం యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించింది, అభిమానులు దేశవ్యాప్తంగా ప్రతి స్క్రీన్‌పై ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ అనుభవాలను సొంతం చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది.
 
దాని విస్తృత పరిధి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, డిస్నీ-హాట్‌స్టార్ కచేరీని అద్భుతమైన నాణ్యతతో ప్రసారం చేస్తుంది, ప్రత్యక్ష ప్రదర్శన యొక్క ఉత్సాహపూరితమైన శక్తిని ప్రేక్షకులకు నేరుగా తీసుకువచ్చి సజావుగా, లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది. నిజమైన ప్యారడైజ్ ఫర్ ఆల్‌ని సృష్టిస్తూ, ఈ అనుభవం కచేరీకి మించి విస్తరించి, చందాదారులకు బ్యాండ్‌కు ప్రత్యేకమైన తెరవెనుక యాక్సెస్‌ను సైతం అందిస్తుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి జియోస్టార్-స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ, "డిస్నీ+ హాట్‌స్టార్‌ వద్ద, మేము అసమానమైన, లీనమయ్యే అనుభవాలతో వీక్షకులను ఆకర్షించడం ద్వారా, మా భాగస్వాములు, ప్రకటనదారులు, ప్రేక్షకులకు స్థిరంగా విలువను అందించడం ద్వారా భారతదేశ వినోదం, క్రీడా వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చాము. కోల్డ్‌ప్లేతో మా భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఐకానిక్ సాంస్కృతిక అనుభవాలను తీసుకురావాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా అధునాతన సాంకేతికత, సాటిలేని పరిధిని ఉపయోగించడం ద్వారా, ప్రీమియం వినోదానికి  ఉన్న అడ్డంకులను మేము ఛేదిస్తున్నాము, దానిని అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము, దేశవ్యాప్తంగా ఉమ్మడి వేడుకను ప్రోత్సహిస్తున్నాము"అని అన్నారు. 
 
వేదిక ద్వారా పంచుకున్న ప్రకటనలో, బ్యాండ్ యొక్క ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ "భారతదేశంలోని మా స్నేహితులందరికీ నమస్తే. జనవరి 26న, అహ్మదాబాద్ నుండి మా ప్రదర్శన డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని మేము సంతోషిస్తున్నాము, కాబట్టి మీరు భారతదేశంలో ఎక్కడి నుండైనా దీన్ని చూడవచ్చు. మీరు మాతో చేరతారని మేము ఆశిస్తున్నాము - మీ అందమైన దేశాన్ని సందర్శించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. అపూర్వమైన ప్రేమను కోరుకుంటున్నాము !" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి