తన బోయ్ ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని అతడికి రూ. 20 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేసింది ఓ వివాహిత. ఐతే ఆ డబ్బు తన భర్త సంపాదించినది కావడంతో డబ్బు ఎక్కడ అని అడిగారు. దాంతో ఉన్న నిజాన్ని చెప్పేసింది ఆ వివాహిత. అంతే... ఆమెపై అత్తింటివారు ఇంతెత్తున లేచి విరుచుకుపడ్డారు. వీడియోలో కనిపించని గొంతు ఒకటి మాత్రం ఆమెను దూషిస్తున్నట్లు అర్థమవుతుంది.
ఈ వీడియోలో ఆ వివాహిత పరిస్థితి చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆమె ఇష్టంలేని వివాహం చేసుకున్నట్టు అర్థమవుతుందని ఒకరంటే... ఇంకొకరు తన బోయ్ ఫ్రెండ్ కోసం అన్ని అవమానాలు భరిస్తుందంటే అతడిపైన ఎంత ప్రేమ వున్నదో కదా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. చూడండి వీడియోను...