Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడిని చెట్టుకు కట్టేసి... ప్రియురాలిపై అత్యాచారం...

Advertiesment
victim girl

ఠాగూర్

, గురువారం, 30 మే 2024 (10:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ, కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఆ యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. 
 
మంగళవారం ఉదయం ఏడుమలై, ఆ యువకుడు సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి ఏడుమలై ఆ యువకుడికి ఫోన్‌ చేసి నీ ప్రియురాలి జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికాడు. కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వైజంక్షన్‌ వద్ద వేచి ఉండగా ఏడుమలై, బాలాజీ వచ్చారు. 
 
కొంతసేపటికి ఆమె రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్‌ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగానే ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి, దాంతోనే అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయారు. బాధితులు కుటుంబసభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వే నా ప్రాణమని నమ్మించాడు... ఇదంతా నిజమని నమ్మా... కానీ అమ్మా...