Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడుపునొప్పి తగ్గిస్తానని బొడ్డుచుట్టూ కొరికిన భూత వైద్యుడు...

Advertiesment
Telangana
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ భూతవైద్యుడు మూడు నెలల శిశువు ప్రాణాలు తీశాడు. కడుపు నొప్పి తగ్గిస్తానని చెప్పి బొడ్డు చుట్టూ కొరికాడు. అతని పంటిగాట్లకు శిశువు పెద్దపేగు తెగిపోయింది. దీంతో ఆయన్ని అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఇది కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడులో మంగళవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానినికి చెందిన ఆశా కార్యకర్త నాగమణి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. రెండు, మూడు రోజులుగా బాబు ఏడుస్తున్నాడు. గ్రామానికి చెందిన భూతవైద్యుడు దేవరబాల (పూనకం వచ్చే వ్యక్తి) వద్దకు తీసుకెళ్లగా అతడు శిశువు బొడ్డుచుట్టూ కొరికాడు. 
 
అయినా బాలుడు ఏడుపు ఆపకపోవడంతో కరకగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆశ కార్యకర్త నాగమణికి ఫోన్‌ చేశారు. ఆమె 108కు సమాచారం అందించడంతో అదే వాహనంలో బాలుడిని భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. 
 
వైద్యులు పరిశీలించగా చిన్నపేగు తెగినట్లు తేలింది. ఆ గాయంతోనే బాలుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇది ఎలా జరిగిందని వైద్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని శిశువు తల్లిదండ్రులు వారు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తగారింట్లో కోడలు ఆత్మహత్య ... ఎందుకో పాపం?