Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ అక్కను తీసుకురా.. లేకపోతే నువ్వు రా.. ప్రభుత్వం మాది.. ఏం చేయలేవు : వాలంటీర్ బెదిరింపులు

harassment

వరుణ్

, గురువారం, 22 ఫిబ్రవరి 2024 (08:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు మరింతగా బరితెగిస్తున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలు, అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా నరసరావుపేటలో ఓ బాలికను వాలంటీరు వేధించాడు.. మీ అక్కను తీసుకురా.. లేకపోతే నువ్వు రా.. మాదే ప్రభుత్వం. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఓ వాలంటీరు బాలికను వేధించాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక(13) ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో పిట్టు శ్రీకాంత్ రెడ్డి(25) వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ఎస్ఐటీలో సీటు వచ్చింది. ఆమె రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో విద్యాదీవెన, తదితర పథకాల కోసం ఓటీపీ చెప్పాలని వాలంటీరు.. విద్యార్థిని ఫోన్ నంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. 
 
నంబరు బ్లాక్ చేసినా వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసేవాడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లెలు వెంటపడ్డాడు. మీ అక్కను తీసుకురా, లేకపోతే నవ్వు రా అంటూ వేధించాడు. ప్రభుత్వం మాదే.. మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు అని హెచ్చరించాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు వాలంటీరు ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. అయినా సరే మంగళవారం మళ్లీ బాలిక వెంట పడగా ఆమె ఎలుకల మందు తాగింది. అలాగే పాఠశాలకు వెళ్లి వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు వాలంటీరుపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. సదరు వాలంటీరు వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, గ్రామంలో పెద్దలకు చెప్పినా తమనే బెదిరిస్తున్నారని బాధితురాలి మేనమామ వాపోయారు. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశామని నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కేసీఆర్ కుమార్తెకు సీబీఐ నోటీసులు