Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

బాలికకు మద్యం తాగించి ఇద్దరు యువకుల అత్యాచారం.. ఎక్కడ?

Advertiesment
rape

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (10:47 IST)
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించిన ఇద్దరు యువకులు ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరసరావు పేట పట్టణ పరధిలో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ బాలికతో కోటప్పకొండకు చెందిన 17 యేళ్ళ బాలుడికి సంబంధం ఉంది. ఈ క్రమంలో ఓ డ్యాన్స్ పార్టీలో పని చేసే బాలుడు తాను చెడు వ్యసనాలకు అలవాటు పడటమే కాకుండా, ఆ బాలికకు కూడా అలవాటు చేశాడు. 
 
ఇదిలావుంటే బస్తాల దుకాణంలో పని చేసే తన స్నేహితుడైన మరో యువకుడు (21).. బాలిక స్నేహితురాలైన ఆరో తరగతి చదివే బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలను బుధవారం రాత్రి కోటప్పకొండ రోడ్డులోని తమ గుడికి పిలిపించుకున్నారు. శీతల పానీయంలో మద్యం కలిపి వారితో తాగించారు. దీంతో వారిద్దరూ బాలికలిద్దరూ మద్యమత్తులోకి జారుకున్నారు. ఆపై ఎనిమిదేళ్ల బాలికపై బాలుడు, యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఆటలాడుకునేందుకు వెళుతున్నామని చెప్పిన కుమార్తెలు రాత్రికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. అక్కడే ఓ గదిలో వీరు నిర్బంధించిన బాలికలను గుర్తించారు. బాలికలతో పాటు సంబంధిత యువకులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికలకు కౌన్సెంగ్ ఇచ్చారు. అయితే, ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు వెనుకాడినట్టు తెలిసింది. వివరణ కోరేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారులు స్పందించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా లేదు: కాగ్ రిపోర్ట్