Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

Advertiesment
knife

ఠాగూర్

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (08:32 IST)
వారిద్దరికీ ఇంకా 16 యేళ్ళు కూడా నిండలేదు. కానీ, ఆ మైనర్ బాలికను ఓ మైనర్ బాలుడు నాలుగేళ్ళుగా ప్రేమిస్తూ వెంటబడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి చేయసాగాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీంతో ఆమె తండ్రి వద్దకు వెళ్లి.. తమకిద్దరికీ పెళ్లి చేయాలని కోరాడు. దీంతో షాక్ తిన్న ఆ తండ్రి... ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దామంటూ సమాధానమిచ్చాడు. అప్పటివరకు తన కుమార్తె వెంట పడకుండా ఉండాలని చెప్పి, ఇంటి నుంచి పంపించివేశాడు. దీంతో పగ పెంచుకున్న ఆ యువకుడు.. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ సబ్ డివిజన్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నిర్మల్‌లో తాపీ మేస్త్రీగా పని చేసే ఓ బాలుడు (16), గత కొంతకాలంగా అదేప్రాంతానికి చెందిన 16 యేళ్ల బాలికను ప్రేమిస్తున్నాడు. ఆమె వెంటపడుతూ ప్రేమించాలని, పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దానికి ఆ బాలిక అంగీకరించలేదు. దీంతో బాలిక తండ్రి వద్దకు వెళ్లి .. మీ కుమార్తెను ప్రేమిస్తున్నానని, అందువల్ల తనకిచ్చి పెళ్ళి చేయాలని చెప్పాడు. ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చాక మాట్లాడుదామని చెప్పాడు. 
 
దీంతో తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదని భావంతో తమ పెళ్లికి నిరాకరించిన యువతి తండ్రిపై కోపం పెంచుకున్నాడు. బాలిక తండ్రిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన తౌసిఫ్ ఉల్లా (20)తో కలిసి శనివారం అర్థరాత్రి యువతి తండ్రిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)