Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ సూపర్ క్యాచ్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు పాదాభివందనం వీడియోలు వైరల్

Advertiesment
కోహ్లీ సూపర్ క్యాచ్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు పాదాభివందనం వీడియోలు వైరల్
, ఆదివారం, 13 అక్టోబరు 2019 (14:03 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూణె వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్‌ని అందుకుని మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 36/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శనివారం 275 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
 
షమి వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నైట్‌ వాచ్‌మెన్‌ నోర్జె(3) స్లిప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు నుంచి కిందగా వెళ్తున్న బంతిని కోహ్లీ డైవ్‌చేస్తూ అమాంతం బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఉమేశ్‌యాదవ్‌ బౌలింగ్‌లో డిబ్రుయిన్‌(30) కూడా కీపర్‌ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అలాగే పూణే వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నేడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ వీరాభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కిందపడేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ సేనురాన్ ముత్తుసామి అవుటవగా వెర్నార్ ఫిలాండర్ క్రీజులోకి వచ్చాడు. అదే సమయంలో స్టాండ్స్‌లోంచి ఓ అభిమాని పరుగున మైదానంలోకి వచ్చాడు.
 
నేరుగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వద్దకు వెళ్లి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో రోహిత్ శర్మ తత్తరపాటుకు గురయ్యాడు. ఆ అభిమానిని నిలువరించబోయి తాను పట్టుతప్పి కిందడిపోయాడు. చివరికి భద్రతా సిబ్బంది వచ్చి ఆ యువకుడ్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు