Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబా వీరేంద్ర సెహ్వాగ్.. పీఛే క్యా హై..?.. 'ఉమ్మడి ఫ్యామిలీ'పై ఫైర్

డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి రాజకీయ వార్తల్లో నిలిచాడు. కాషాయ దుస్తులేసుకుని, కమండలం పట్టుకుని, మెళ్ళో రుద్రాక్షలతో ప్రత్యక్షమై 'నేనంటే నేనే' అనేశాడు. ఫన్నీ ఎలిమెంట్‌గా ఎక్స్‌పోజ్ అ

Advertiesment
Virender Sehwag
, ఆదివారం, 5 ఆగస్టు 2018 (16:48 IST)
డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి రాజకీయ వార్తల్లో నిలిచాడు. కాషాయ దుస్తులేసుకుని, కమండలం పట్టుకుని, మెళ్ళో రుద్రాక్షలతో ప్రత్యక్షమై 'నేనంటే నేనే' అనేశాడు. ఫన్నీ ఎలిమెంట్‌గా ఎక్స్‌పోజ్ అవుతూ సదరు ఫోటోను ట్విట్టర్లో పెట్టేశాడు.
 
అకస్మాత్తుగా వీరూకు ఈ కాషాయం రంగు ఎందుకు అంటుకుందనే విషయంపై ఇపుడు రసవత్తర చర్చ మొదలైంది. ఆ చర్చ చివరకు హ్వాగ్ బీజేపీలో చేరనున్నారా? అనే టాక్ మొదలైంది. ఒక్కసారి 6 నెలల వెనక్కి వెళితే వీరూకి సంబంధించి ఒక ఫ్లాష్‌బ్యాక్ కనిపిస్తుంది. కేరళలో ఆకలిగొన్న ఒక దళితుడ్ని రోడ్డుమీదే కొట్టి చంపిన జనం గురించి ఆవేశంగా ఆయనో ట్వీట్ చేశారు.
 
ఈ దాష్టీకానికి పాల్పడ్డానికి వీళ్లకు మనసెలా వచ్చింది అంటూ ఆ గుంపులోని నలుగురు ముస్లింల పేర్లు ప్రస్తావించాడు. అంతమంది జనంలో ఆ నలుగురు ముస్లిం మతస్తులే నీకు కనిపించారా? అంటూ సెహ్వాగ్ మీద సోషల్ మీడియాలో తాకిడి షురూ అయ్యింది. ఆ గొడవ మరింత చెలరేగక ముందే ఒక సారీ చెప్పి తప్పించుకున్నాడు. తాజాగా కాషాయ వస్త్రధారణలో కనిపించి మరోమారు వార్తలకెక్కాడు. 
 
మరోవైపు, పాఠ్య పుస్తకాల ముద్రణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబం గురించి తప్పుడుగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ముద్రణపై వీరూ ఫైర్ అయ్యారు. సంబంధిత కాపీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అధికారులు ఏమాత్రం చెక్ చేయకుండా ఇలాంటి పుస్తకాల ముద్రణకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇలాంటి చెత్తను మన పిల్లలు చదవాలా? అంటూ నిలదీశాడు. అందులో ఉమ్మడి కుటుంబం అనే హెడ్డింగ్ కింద ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. ఉమ్మడి కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేయలేదు అని ఉంది. దీనిపైనే సెహ్వాగ్ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్చ్... రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు