Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశాన్ని కాపాడండయ్యా.. కాశ్మీర్ మనకెందుకయ్యా: షాహిద్ అఫ్రిది

Advertiesment
దేశాన్ని కాపాడండయ్యా.. కాశ్మీర్ మనకెందుకయ్యా: షాహిద్ అఫ్రిది
, బుధవారం, 14 నవంబరు 2018 (18:39 IST)
కాశ్మీర్ గురించి భారత్- పాకిస్థాన్‌ల మధ్య పెద్ద రచ్చే జరుగుతున్న నేపథ్యంలో.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వున్న నాలుగే నాలుగు ప్రావిన్స్‌లనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. ఇక మనకెందుకు కాశ్మీర్ అంటూ షాహిద్ అఫ్రిది ఘాటుగా వ్యాఖ్యానించాడు. 


లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని.. పాకిస్థాన్‌ను మంచిగా చూసుకుంటేనే చాలునని.. ప్రభుత్వానికి హితవు పలికాడు.
 
వున్న నాలుగు ప్రావిన్స్‌లను ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడం తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది ఘాటుగా ధ్వజమెత్తాడు. కాశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం కూడా తనకెంతో బాధగా వుందని.. కాశ్మీర్‌ గురించి పాకిస్థాన్ మరిచిపోవడమే కాదు.. భారత్‌కు కూడా కాశ్మీర్ ఇవ్వొద్దని అఫ్రిది అన్నాడు. కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని వ్యాఖ్యానించాడు. 
 
కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని.. మానవత్వం వెల్లివిరియాలని అఫ్రిది కామెంట్ చేశాడు. కానీ అఫ్రిది వ్యాఖ్యలపై పాక్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా భారతీయులు, క్రికెట్ ఫ్యాన్స్ అఫ్రిది మాటలపై ఎలా సోషల్ మీడియాలో స్పందిస్తారో కూడా వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ ఎన్నికల్లో మోర్తాజా.. సూపర్ ఫామ్‌లో వుండగా అవసరమా?