ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో చేతిలో ఓడిపోయిన ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్సీ వ్యూహలు బాగా లేవు అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
అయితే ఢిల్లీ కాపిటల్స్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర వహించాడు అనుకున్న నోర్జె చివరికి నిషేధానికి గురయ్యాడనే సంగతి తెలిసిందే. దీంతో రిషబ్ పంత్‌కి ఊహించని షాక్ తగిలింది. అతని వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యాయని.
భారత్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు ఢిల్లీ బౌలర్ నోర్జె. అయితే లక్నోలో జరిగిన మ్యాచ్లో 14 ఓవర్లో వరుసగా రెండు భీమర్లు వేసాడు నోర్జె.
అయితే ఐపీఎల్‌లో ఉన్న రూల్స్ ప్రకారం వరుసగా రెండు భీమర్లు వేస్తే ఇక పూర్తిగా ఒక మ్యాచ్ వరకు కూడా బౌలింగ్ చేయకుండా నిషేధం విధించేందుకు అవకాశముంది. అంపైర్లు ఇదే నిర్ణయం తీసుకుని బౌలింగ్ నుంచి నోర్జెను తప్పించారు.