Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ వేదికగా లంక వన్డే మ్యాచ్ : సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బోణీ కొట్టగా, రెండో వన్డేలో భారత్ విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా ఆదివారం జరుగన

Advertiesment
India vs Sri Lanka
, శనివారం, 16 డిశెంబరు 2017 (20:05 IST)
స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బోణీ కొట్టగా, రెండో వన్డేలో భారత్ విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ సేన ఉవ్విళ్లూరుతోంది. 
 
మొహాలీలో జరిగిన రెండో వన్డేలో లంకేయుల్ని చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ సిరీస్‌ను సమం చేసింది. దీంతో సిరీస్‌ ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది. దాంతో ఆదివారం విశాఖ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. మధ్యాహ్నం గం. 1.30 ని.లకు నిర్ణయాత్మక ఆఖరి వన్డే ప్రారంభంకానుంది.
 
గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. ఆ క్రమంలోనే మరొక సిరీస్‌పై దృష్టిసారించింది. ఇదిలా ఉంచితే, టెస్టు సిరీస్‌ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. శ్రీలంక కంటే  చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో టీమిండియానే మెరుగ్గా ఉంది. 
 
అయితే ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ను కుప్పకూల్చిన శ్రీలంక తాము ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పింది. సంచలనాలకు మారుపేరైన లంకను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టీమిండియా సమష్టిగా రాణిస్తేనే లంకను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ తరహాలో జల్లికట్టు ప్రీమియర్ లీగ్.. చెన్నై సూపర్ బుల్స్ రెఢీ