కాన్పూర్ వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. ఫలితంగా కివీస్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 296 పరుగులకే ఆలౌట్ చేశారు. రెండో రోజు ఆటలో పూర్తిగా తేలిపోయిన భారత బౌలర్లు.. మూడో రోజు మాత్రం పకడ్బంధీగా బౌలింగ్ చేశారు.
ఫస్ట్ ఇన్నింగ్స్ రెండో రోజున భారత బౌలర్ల సహనానికి కివీస్ ఓపెనర్లు పరీక్ష పెట్టారు. ఓపెనర్లు యంగ్ (89), టామ్ లాథమ్ (95)లు క్రీజ్‌లో పాతుకునిపోయి పరుగుల వరద పారించారు. వీరిద్దిర భాగస్వామ్యాన్ని విడదీసిన తర్వాత వచ్చిన కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఏ ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుగా నిలబడలేకపోయారు.
ఫలితంగా విలియమ్సన్ (18), రాస్ టేలర్ (1), హెన్రీ నికోల్స్ (2), టామ్ బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13), జెమీసన్ (23), సౌథీ (5), సోమవర్ విల్లే (6), అజాజ్ పటేల్ (5 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్ల తీసి సత్తా చాటగా, అశ్విన్ 3, జడేజా, ఉమేష్ యాదవ్‌లు ఒక్కో వికిట్ తీశారు.
ఫలితంగా 142.3 ఓవర్లలో కివీస్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసిన విషయంతెల్సిందే. దీంతో కివీస్ ఇంకా 49 పరుగులు వెనుకబడివుంది. ప్రస్తుతం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.