Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీకి వందో టెస్ట్ - భారత్ - శ్రీలంక తొలి టెస్ట్ - టాస్ గెలిచిన రోహిత్

కోహ్లీకి వందో టెస్ట్ - భారత్ - శ్రీలంక తొలి టెస్ట్ - టాస్ గెలిచిన రోహిత్
, శుక్రవారం, 4 మార్చి 2022 (10:34 IST)
స్వదేశంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం మొహాలీ వేదికగా ప్రారంభమైంది. మొత్తం రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడతాయి. ఈ టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వందో టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పరుగులు వరద పారించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 
 
పైగా, కోహ్లీకి ఇది ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. కాగా, వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ 12వ ఆటగాడు. ఇప్పటివరకు వంద టెస్టులు ఆడిన భారత మాజీ క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, సంచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు ఉన్నారు. ఇపుడు కోహ్లీ చేరారు. 
 
గత 2001లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నిగ్స్‌లలో కలిపి 4, 15 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత కోహ్లీ పరుగుల దాహం తీర్చుకున్నారు. ఈ పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధికమించారు. 50.39 శాతం సగటుతో 7962 పరుగులు చేశారు. గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్న కోహ్లీ వందో టెస్టులో తన ప్రతాపం చూపిస్తారనని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఇకలేరు