Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్ నెహ్రా : షోయబ్ అక్తర్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ చాలా రోజులుకు ఓ మంచి కామెంట్ చేశారు. అదీ కూడా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత బౌలర్ అశీష్ నెహ్రా గురించి. ఈ కామెంట్స్ ప్రతి ఒక్కరి మనసును హత్తుక

Advertiesment
Shoaib Akhtar
, శుక్రవారం, 3 నవంబరు 2017 (15:41 IST)
రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ చాలా రోజులుకు ఓ మంచి కామెంట్ చేశారు. అదీ కూడా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత బౌలర్ అశీష్ నెహ్రా గురించి. ఈ కామెంట్స్ ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఉంది. దీనికి సంబంధించిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీకి చెందిన 38 ఏళ్ల వయసున్న నెహ్రా, సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లాలో ఇటీవల న్యూజిల్యాండ్‌తో టీ-20ని ఆడి, తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై అక్తర్ ట్వీట్ చేస్తూ, తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తని అన్నాడు. 
 
తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన కెరీర్‌లో పలుమార్లు ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న నెహ్రా, ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి ప్రధాన జట్టులో స్థానం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని అక్తర్ తన ట్వీట్‌లో గుర్తు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్