Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ వయసులో ఫాస్ట్ బౌలింగా.. అంతే అంటున్న నెహ్రా

తనలాంటి వయసు మళ్లిన బౌలర్లకు ఫాస్ట్ బౌలింగ్ అంత సులువు కాదని భారత లెప్ట్ ఆర్మ్ ఫేసర్ అశీష్ నెహ్రా పేర్కొన్నాడు. ఈ వయసులో తన బౌలింగులో వాడీ వేడీ తగ్గకుండా ఉండటానికి తాను చాలా కష్టపడుతున్నానని చెప్పాడు. రోజులో కొన్ని గంటలు అదనంగా శ్రమించడం ద్వారా తన పే

ఈ వయసులో ఫాస్ట్ బౌలింగా.. అంతే అంటున్న నెహ్రా
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (05:40 IST)
తనలాంటి వయసు మళ్లిన బౌలర్లకు ఫాస్ట్ బౌలింగ్ అంత సులువు కాదని భారత లెప్ట్ ఆర్మ్ ఫేసర్ అశీష్ నెహ్రా పేర్కొన్నాడు. ఈ వయసులో తన బౌలింగులో వాడీ వేడీ తగ్గకుండా ఉండటానికి తాను చాలా కష్టపడుతున్నానని చెప్పాడు. రోజులో కొన్ని గంటలు అదనంగా శ్రమించడం ద్వారా తన పేస్ బౌలింగును కొనసాగిస్తున్నానని చెప్పాడు. సుదీర్ఘ క్రికెట్ జీవితంలో నెహ్రా ఇంతవరకు 10  శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో కానీ, టీ20 సీరీస్‌లో కానీ భారత్ తరపున అద్వితీయ ఫలితాలు సాధించి అబ్బురపరుస్తున్న నెహ్రా తన కెరీర్ కొనసాగింపుకు ఫిట్‌నెసే కారణం అంటున్నారు.
 
పేస్ బౌలింగ్ నాకు చాలా ముఖ్యం. నా యాక్షన్ లోనే పేస్ సహజాతిసహజంగా వచ్చేస్తుంది. అదే సమయంలో నా ఫిట్‌నెస్ స్థాయిని స్థిరంగా ఉంచుకోవడంలో నేను కఠోర శిక్షణ తీసుకుంటున్నాను. అవసరం ఎప్పుడొచ్చి పడనా సరే, నేను వేగంగా బంతులేయగలను అన్నాడు. గత సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ చాంపియన్ చేయడంలో అద్వతీయ ప్రతిభ ప్రదర్శించిన నెహ్రా ఈ ఏడు ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరుతో తలపడనున్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.
 
ప్రతి ఆటగాడూ తమ విభిన్నమైన శిక్షణలను, శిక్షకులను కలిగి ఉంటారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా నా శైలిలో నేనూ శిక్షణ పొందుతున్నాను. పైగా ఈ వయస్సులో ఫాస్ట్ బౌలింగ్ వేయడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు, కానీ ఆ స్థాయిలో ఆడాలంటే ప్రతిరోజూ కనీసం నాలుగైదు గంటలు నాకు నేను శ్రమించాల్సిందే అని నెహ్రా చెప్పాడు. 
 
సుదీర్ఘమైన కెరీర్‌లో దీర్ఘకాలిక గాయాలను మోసుకువస్తున్నాను. ఇప్పటికే 10-12 సర్జరీలు జరిగాయి. అది అంత సులభం కాదు. కానీ ఏది ఉత్తమమో దాన్ని నేను ప్రదర్శిస్తుండటం సంతోషం కలిగిస్తోంది.ఇతర క్రికెటర్లతో పోలిస్తే నేను కొన్ని గంటలు అధకంగా శ్రమించాలి, చివరికి ప్రాక్టీసుకు కూడా నేను సిద్ధం కావలిసిందే. ఆట పూర్తయి అలిసిపోయాక మసాజ్ చేసుకోవలసి ఉంటుంది. ఐస్ స్నానం చేయాల్సి ఉంటుంది, లేదా స్విమ్మింగ్ పూల్‌లో ఈదులాడాల్సి ఉంటుంది. కానీ నేను వీటిని తప్పక చేయాల్సిందే అన్నాడు నెహ్రా.
 
2017 ఐపీఎల్‌లో టాప్ పోర్‌కి చేరడమే మా జట్టు లక్ష్యం,  చాలామంది మమ్మల్ని అధిక ఒత్తిడికి గురవుతుంటారా అని అడుగుతారు. వత్తిడి కాదు అది మా బాధ్యత. మంచి క్రికెట్ ఆడటం, చివరి నాలుగు జట్లలో చేరడం. చివరి నాలుగు జట్లలో ఒకటి కావాలంటే మొత్తం 14 జట్లు ఆడాలి అని నెహ్రా చెప్పాడు. సన్ రైజర్స్ కు మంచి బౌలింగ్ బృందం ఉందని ఈసారి కూడా అదే ఫలితాలను సాధించగలమన్న నమ్మకం ఉందని నెహ్రా ఆత్మ విశ్వాసం ప్రదర్సించాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#cricket wali beat: సోనూ నిగమ్‌తో గొంతు కలిపేశాడు.. సచిన్ పాట పాడేశాడు..