భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరైపోతాయి.
ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇరు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడి, మూడు మ్యాచ్‌లలో ఓడిపోయాయి. ఇపుడీ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉన్నాయి.
సహజంగానే, భారీ స్కోరు సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్‌కు శ్రీలంక స్పిన్నర్లు అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. బెయిర్ స్టోర్, డేవిడ్ మలాన్, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి హేమాహేమీ బ్యాట్సమెన్లు ఉన్నప్పటికీ ఈ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తడబడుతుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టులోకి మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్ స్టన్‌లను తీసుకున్నారు. పేసర్ రీస్ టాప్‌లే చేతి వేలు విరగడంతో స్వదేశానికి వెళ్లిపోయారు. పేసర్ గస్ ఆట్కిన్సన్, యువబ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌లను పక్కనబెట్టారు. అలాగే, శ్రీలంక జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ ఏజెంట్‌లో మాథ్యూస్‌కు చోటుకల్పించడం సానుకూలాంశం. పేసర్ లహిరు కుమారు కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు.