దులీప్ ట్రోఫీలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ సరసన ధ్రువ్ జురెల్ నిలిచాడు. 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్ తరఫున ధోనీ ఈ ఘనత సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఈ రికార్డును ఇండియా-ఏ తరఫున ధ్రువ్ సమం చేశాడు. ఇక తర్వాతి స్థానాల్లో బెంజమిన్ (6 క్యాచ్‌లు, 1973-74), విశ్వనాథ్ (6 క్యాచ్‌లు, 1980-21) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి రోజు అయిన ఇవాళ ఆటలో మిగిలిన 78 ఓవర్లలో.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 76 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది.
ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.