Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌ క్రికెట్‌కు అత్యంత చెత్త ఓటమి...

Advertiesment
england test team

ఠాగూర్

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:48 IST)
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చేతిలో పాకిస్థాన్ అత్యంత చెత్త ఓటమి పాలయ్యారు. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా స్కోర్ సాధించి కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైన తొలి జట్టుగా అవతరించి. ట్రిపుల్ సెంచరీ హీరో హ్యారీ బ్రూక్‌కు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
ఇటీవలే స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో అవమానకరమైన ఓటమి ఎదురైంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఏకంగా ఇన్నింగ్స్, 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 556 పరుగులు సాధించినప్పటికీ ఈ ఘోర ఓటమి ఎదురైంది. 
 
మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగుల స్కోరు చేయగా.. పర్యాటక జట్టు ఇంగ్లండ్ ధీటుగా సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 823 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌కు డిక్లేర్ చేసింది. 267 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లండ్ సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 220 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్, 47 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై జయకేతనం ఎగురవేసింది.
 
కాగా 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌ 500లకు పైగా పరుగులు సాధించి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో పాకిస్థాన్‌కు అవమానకరమైన ఓటమి ఎదురైంది. అవాంఛనీయ రికార్డు నమోదైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకుపైగా స్కోర్ చేసి కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన మొట్టమొదటి జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.
 
కాగా ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జో రూట్ డబుల్ సెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. వీరిద్దరూ కలిసి రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా సాధించడంలో అబ్దుల్లా షఫీక్, కెప్టెన్ షాన్ మసూద్, అఘా సల్మాన్ కీలక పాత్ర పోషించారు. వీరు ముగ్గురూ సెంచరీలతో కదం తొక్కారు. కాగా ట్రిపుల్ సెంచరీతో రాణించిన హ్యారీ బ్రూకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్