పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఆ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసింది. టెస్ట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్ 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 317 పరుగులు చేసింది. ఈయన ట్రిపుల్ సెంచరీతో క్రీజ్‌లో విధ్వంసం సృష్టించాడు.
అలాగే, సూపర్ ఫామ్‌లో ఉన్న జో రూట్ 375 బంతుల్లో 17 ఫోర్లు సాయంతో 262 డబుల్ సెంచరీ బాదేశాడు. బెన్ డకెట్ 75 బంతుల్లో 84 పరుగులు చేయగా, జాక్ క్రాలీ 85 బంతుల్లో 78 పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 267 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగులకు ఆలౌటైంది.
హ్యారీ బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఇది రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) మొదటి స్థానంలో ఉన్నాడు. పాక్‌పై బ్రూక్, రూట్ జోడీ నాలుగో వికెట్‌కు ఏకంగా 454 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టెస్టుల్లో మూడుసార్లు 800 కంటే ఎక్కువ రన్స్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. ే