Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేఎల్ రాహుల్ అఫైర్.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? (video)

Advertiesment
కేఎల్ రాహుల్ అఫైర్.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? (video)
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:24 IST)
భారత క్రికెట్ జట్టులో బ్యాటింగ్‌కి సంబంధించి విరాట్ కోహ్లీనే టాప్. రోహిత్ కూడా తనదైన ప్రదర్శనతో ధీటుగా సాగిపోతున్నాడు. కానీ ఇప్పుడు మైదానం వెలుపల మాత్రం ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతున్నది కేఎల్ రాహులే.


హార్దిక్ పాండ్యాతో కలిసి ఓ టీవీ షోలో అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ మీడియాలో ఎంతగా హైలైట్ అయ్యాడో తెలిసిందే. దీనికి తోడు తరచుగా అమ్మాయిలతో ఎఫైర్లంటూ వార్తల్లో నిలుస్తుండటం విశేషం. ఒక అమ్మాయితో రాహుల్‌కు ఎఫైర్ ఉందంటారు. 
 
కొన్ని నెలలు గడుస్తాయి. మరో అమ్మాయితో ఎఫైర్ అంటూ వార్తలు వస్తాయి. ఇంకొన్ని నెలలకు కొత్త పేరు తెరపైకి వస్తుంది. తెలుగు సినిమాల్లో తళుక్కుమంటున్న నిధి అగర్వాల్తో ముందుగా రాహుల్‌కు ఎఫైర్ అన్నారు. ఆ తర్వాత సునీల్ శెట్టి కూతురి అతియా శెట్టితో అతడి పేరు వినిపించింది. తాజాగా రాహుల్ కొత్తమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని, ఇది కొంచెం సీరియస్సే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష సింగ్ రంజన్. ఈ అమ్మాయి సినీ తార కాదు. కానీ సినిమా వాళ్లతో బాగానే సంబంధాలున్నాయి. ఆలియా భట్‌కు మంచి స్నేహితురాలైన ఆకాంక్ష, అంకిత్ తివారి చేసిన తేరే దో నైనా అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. ఆకాంక్షను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా, ట్విట్టర్లో ఎనిమిది వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 
 
ఇటీవలే ఆలియా, ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌లకు రాహుల్‌ని ఆకాంక్ష పరిచయం చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. రాహుల్ ఒకప్పుడు ప్రేమాయణం నడిపినట్లుగా చెప్పుకున్న ఆతియా రాహుల్ ఆకాంక్షలతో కలిసి ఫొటో దిగడం విశేషం. ఆకాంక్షతో ఎఫైర్ గురించి రాహుల్‌ను అడిగితే, తన గురించి పత్రికల్లో ఏం రాస్తున్నారో తనకు తెలియదని తాను వ్యక్తిగత విషయాలు చర్చించనని, క్రికెట్ మీదే తన దృష్టి అని సమాధానం ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు గ్లౌజ్‌లు మాత్రమే.. ఒంటిపై నూలుపోగు లేకుండా సారా టేలర్?