Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ శతకం... సచిన్ రికార్డుకు మరో ఏడు అడుగుల దూరంలో...

మళ్లీ శతకం... సచిన్ రికార్డుకు మరో ఏడు అడుగుల దూరంలో...
, గురువారం, 15 ఆగస్టు 2019 (14:56 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ముఖ్యంగా, సెంచరీలతో పాత రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ రికార్డుకు మరో ఏడు అడుగులు దూరంలో ఉన్నాడు. 
 
వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు బుధవారం మూడో వన్డే ఆడింది. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. విండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లి 43 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 
 
అలాగే ఒక శతాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌‌గానూ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉంది. 2000-2010 మధ్యకాలంలో అతను 18,962పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లి పాంటింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. గత దశాబ్దకాలంలో 20 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.
 
ఆ తర్వాతి స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కల్లీస్ 16777 పరుగులతో, ఆ తర్వాత శ్రీలంక ఆటగాడు జయవర్ధనే 16304 పరుగులతో, మరో ఆటగాడు సంగక్కర 15999 పరుగులతే సచిన్ టెండూల్కర్ 15962 పరుగులుతో రాహుల్ ద్రావిడ్ 15853 పరుగులతో, ఆషీం ఆమ్లా 15185 పరుగులతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 
 
మరోవైపు, వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు బ్రేక్‌ చేయడానికి విరాట్‌ మరో 7 సెంచరీల దూరలో ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(49) సాధించిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాచ్ జారవిడిచాం.. భారీ మూల్యం చెల్లించుకున్నాం : జేసన్ హోల్డర్