Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికార్డు రారాజు కోహ్లీకి మరో రెండు రికార్డులు దాసోహం...(Video)

రికార్డు రారాజు కోహ్లీకి మరో రెండు రికార్డులు దాసోహం...(Video)
, సోమవారం, 12 ఆగస్టు 2019 (11:54 IST)
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి మరో రెండు రికార్డులు దాసోహమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ‌లో విరాట్ కోహ్లీ శతకంతో రాణించాడు. అదేసమయంలో మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో విరాట్ కోహ్లీ (11,406) రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ (11,363)ని వెనక్కి నెట్టి కోహ్లీ ద్వితీయ స్థానానికి చేరాడు. బెంగాల్ దాదా 311 మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కోహ్లీ 238వ వన్డేలోనే అధిగమించడం గమనార్హం. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (18, 426) టాప్‌లో ఉన్నాడు. 
 
ఇకపోతే, 26 యేళ్ళ క్రితం పాకిస్థాన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ వెస్టిండీస్‌పై జావేద్ మియాందాద్ (1930) నెలకొల్పిన రికార్డును కూడా భారత కెప్టెన్ చరిత్రలో కలిపేశాడు. ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ విండీస్‌పై 64 మ్యాచ్‌లాడి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిస్తే.. కోహ్లీ (2031) కేవలం 34 మ్యాచ్‌ల్లోనే దాన్ని అధిగమించాడు. ఆస్ట్రేలియా దిగ్గజం మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.
 
ఇకపోతే, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు తన వన్డే కెరీర్‌లో 42 సెంచరీలు చేయగా, ఈ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (49)కు కోహ్లీ కేవలం 7 సెంచరీల దూరంలో ఉన్నాడు. అలాగే, విండీస్‌పై కోహ్లీ 9 సెంచరీలు చేశాడు.

ఒకే ప్రత్యర్థిపై సచిన్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ శతకాలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ స్థానం. తాజా మ్యాచ్‌లో గంగూలీని వెనక్కి నెట్టిన కోహ్లీ 8వ స్థానానికి చేరాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శతకంతో రెచ్చిపోయిన కోహ్లీ..(video)