Publish Date: Wed, 24 Aug 2022 (20:36 IST)
Updated Date: Wed, 24 Aug 2022 (20:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,113 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 338 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ కేసుల్లో అత్యధికంగా 135 మంది హైదరాబాద్ నగర పరిధిలోనే ఉన్నారు. అలాగే, రంగారెడ్డిలో 33, మల్కాజిగిరి జిల్లాలో 29 మందికి ఈ వైరస్ సోకింది.
అదేసమయంలో 507 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే, గత 24 గంటల్లో కరోనా బాధితుల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,32,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,26,269 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,553 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
అదేసమయంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,649 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.62 శాతంగా ఉంది. అలాగే, 36 మంది చనిపోయారు. వీరితో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,27,452కు చేరింది.
ఠాగూర్
Publish Date: Wed, 24 Aug 2022 (20:36 IST)
Updated Date: Wed, 24 Aug 2022 (20:37 IST)