యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్-14 మోడల్స్ తయారీకీ రంగం సిద్ధం చేస్తోంది. తొలుత చైనాలోనే తయారయ్యే ఈ ఫోన్స్.. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత్‌లో రిలీజ్ అవుతాయి.
కానీ ప్రస్తుతం భారత్‌లోనే ఐఫోన్-14 మోడల్స్ తయారైతే ఈ పరిస్థితి వుండదు. యాపిల్ నుంచి వచ్చే తదుపరి ఐఫోన్ భారత్, చైనాల్లో దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం
విదేశాల నుంచి భారత్‌కు ఐఫోన్ దిగుమతి అయి విడుదలయ్యేందుకు దాదాపు 6 నెలల నుంచి 9 నెలల వరకు పడుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్ భారత్‌లో ఐఫోన్-14 మోడల్స్‌ను తయారు చేయాలని భావిస్తుండడం విశేషం.
అంతేగాక, చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న కారణంతో యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తుల సాధ్యాసాధ్యాలను యాపిల్ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.