కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ సోకినా ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా కరోనా టీకాల పంపిణీ జోరుగా సాగుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2.88 కోట్ల కరోనా టీకాలు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు 43,25,17,330 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వివరించింది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 187వ రోజుకు చేరగా.. ఒకే రోజు 20,83,892 వ్యాక్సిన్ మోతాదులను అందించారు.
ఇందులో 10,04,581 మొదటి మొతాదులు కాగా 95,964 మందికి రెండో డోసు వేశారు. 18 నుంచి 44 యేళ్లలోపు వారిలో 13,04,46,413 మందికి మొదటి డోసు, మరో 53,17,567 మందికి రెండో మోతాదు అందజేసినట్లు వివరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 8-44 ఏజ్ గ్రూప్‌లో కోటికిపైగా మోతాదులు వేశాయని చెప్పింది.