Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కరాళనృత్యం, ఇటలీలో యుద్ధం చేస్తున్న దేవత

Advertiesment
Coronavirus
, శుక్రవారం, 13 మార్చి 2020 (18:23 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసినప్పటికీ.. ఇటలీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది. ఇటలీ దేశంలో నివసించే ప్రజలు ఒక్కరు కూడా బయటకు రావడానికి వీల్లేదంటూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా ఇటలీనే అధికం. దీంతో ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే, ఇటలీ వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పైగా, ఇటలీలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతో అనేక మంది వైద్య సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ఇలాంటి వారిలో అనేక యువ నర్సులు, వైద్యులు, సహాయక సిబ్బంది ఉన్నారు. అలాంటి యువ నర్సుల్లో ఒకరు అలేషియా బొనారి. ఈమె తన ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కరోనాపై యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో రోగుల ప్రాణల సంగతి పక్కనబెడితే.. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా తమ ప్రాణాలకే ముప్పు తప్పదని తెలిసి కూడా వారు వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. దీనికి అలేషియా ఫోటోనే సజీవసాక్ష్యంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ యువతి చూసేందుకు తెల్లగా చాలా అందంగా ఉంటుంది. కానీ, ఇపుడు కందిపోయిన చెక్కిళ్లు, ఎర్రగా మారిన ముఖంతో అందవిహీనంగా కనిపిస్తోంది. ఇటలీలో కరాళనృత్యం చేస్తున్న కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న నర్సుల్లో ఒకరు. వృత్తిపట్ల తనకున్న చిత్తశుద్ధి కారణంగానే ఆమె తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి సేవ చేస్తోంది. వృత్తినే దైవంగా భావించే అలేషియాలు ఇటలీలో ఎందరో ఉన్నారు. కరోనా బాధితులకు సేవ చేయడం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదో ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
webdunia
 
"నేనో నర్సును. ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నా. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని భయం. నేను ధరించిన కళ్లద్దాలు నా కళ్లను సరిగా కవర్ చేయట్లేదేమోనని భయం. గ్లోవ్స్ వెసుకున్న చేతులతో నన్ను నేను అజాగ్రత్తగా తాకి ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డానేమోనని భయం. ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తర్వాత ఏకధాటిగా ఆరు గంటల పాటు మంచి నీళ్లు తాగకుండా బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది.
 
ఇంతటి ఒత్తిడి కారణంగా నేను శారీరకంగానేకాకుండా మానసికంగా కూడా అలసిపోతున్నా. ఇది నేను మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. నాలాగే ఎంతో మంది తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. కానీ నాకు నా వృత్తి అంటే ప్రేమే కాదు గౌరవం కూడా. ప్రశాంతత కోసం నా ఇంటికి వెళ్లేందుకు నాకు ఇష్టం లేదు. అందుకే నేను నిరంతరం రోగులకు సేవ చేస్తా. నా భాధ్యత నిర్వర్తిస్తా. మీరు కూడా మీ బాధ్యతలను నిర్వర్తించండి" అంటూ తన ముగించింది. ముఖ్యంగా, కేవలం ఆరు గంటలపాటే కాకుండా, గంటలతరబడి మాస్క్ ధరించడం వల్ల ఆమె మొహం ఒరుసుకుపోయింది. 
 
ఆమె చేసిన పోస్టుకు గన్ని గంటల్లో లక్షలకు పైగా లైకులు, కామెంట్స్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. 'అలేషియా.. నువ్వు చేస్తున్న సేవ వెలకట్టలేనిది, నీలాంటి వారే నిజమైన దేవతలు. నువ్‌ దేవుని బిడ్డవు.. థ్యాంక్స్‌ అలేషియా' అంటూ వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో పెరిగిన కరోనా రోగులు.. కేరళలో 900 మంది అనుమానితులు?