Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరుద్యోగులకు శుభవార్త.. 91 పోస్టులకు నోటిఫికేషన్

Advertiesment
Rajiv Gandhi University Recruitment
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:30 IST)
నిరుద్యోగులకు నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 
 
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4, ఇతర పోస్టులకు ఫిబ్రవరి 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
మొత్తం 59 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ విభాగాల్లో గెస్ట్ ఫాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
 
-తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ తదితర సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాల్లోనూ గెస్ట్ ఫ్యాకల్టీని బర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
 
-గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈసీఈ, సివిల్, కెమికల్, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టాభిపై దాడి.. ఇంటికి చేరుకుని పరామర్శించిన చంద్రబాబు