Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 499 వైద్యుల నియామకాలు..

ఏపీలో 499 వైద్యుల నియామకాలు..
, బుధవారం, 23 డిశెంబరు 2020 (14:02 IST)
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వం సేవలను మరింత మెరుగు పర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 499 మంది వైద్యుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. 
 
ఈ ఉద్యోగాల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లను విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీలు, ఇతర వివరాలు జిల్లాల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్లలో ఆ వివరాలను చూసుకోవచ్చు.
 
కాగా.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. అయితే పట్టణాల్లోని వివిధ కాలనీల ప్రజలు ఆరోగ్య సమస్యలు తెలెత్తినప్పుడు బోధనాస్పత్రుల వరకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
 
వీరికి వైద్య సేవలు మరింత చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి వివిధ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టనుంది. దీంతో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టరు, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎంల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసమే 499 వైద్య నియామకాలను చేపట్టనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన క్లాస్‌మేట్‌ ఇంటరాక్టివ్‌ సిరీస్‌: చిన్నారులలో సృజనాత్మకతను మెరుగుపరచడానికి ఐటీసి ఒరిగామీ నోట్‌బుక్స్‌