Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertiesment
Jobs
, శుక్రవారం, 28 జులై 2023 (13:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 1520 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపికాంత్ రెడ్డి బుధవారం ఈ నోటిఫికేషన్‌ను జారీచేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుం కింద రూ.500, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ తదితర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అయితే, ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,040 నుంచి రూ.90,050 వరకు వేతనం చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 19వ తేదీ సాయంత్రం 5.30 గంటలతో ముగుస్తుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విధిగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు లేదా ఇంటర్‌లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకునివుండాలి. ఒక యేడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రైనింగ్ లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో యేడాది పాటు అప్రెంటిషిప్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 యేల్ల మధ్యలో ఉండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపార్టుమెంట్ నుంచి దూకి వివాహిత ఆత్మహత్య