Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమేజాన్‌లో 110,000 పైగా ఉద్యోగ అవకాశాలు

అమేజాన్‌లో 110,000 పైగా ఉద్యోగ అవకాశాలు
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (19:59 IST)
అమేజాన్ 110,000 పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. భారతదేశ వ్యాప్తంగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలను ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోలకతా, లక్నో మరియు చెన్నై తదదితర నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
ఈ నియామకాల్లో ఎక్కువ భాగం అమెజాన్‌లోని ప్రస్తుత అసోసియేట్స్ నెట్‌వర్క్‌లో చేరాయి మరియు వినియోగదారుల ఆర్డర్‌లను సురక్షితంగా, సమర్ధవంతంగా పికప్ చేసుకునేందుకు, ప్యాక్ చేయడానికి, షిప్పింగ్ చేసేందుకు మరియు వితరణ చేసేందుకు వారికి మద్దతు ఇస్తోంది. 
 
ఈ కొత్త నియామకాల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు కూడా ఉండగా, వీరిలో కొందరు వర్చ్యువల్ కస్టమర్ సర్వీస్ మోడల్‌లో భాగంగా, ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు. 
 
ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో ఈ నెల మొట్టమొదటి కెరీర్ డేలో భాగంగా ఇటీవల ప్రకటించిన 8,000 ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు ఇందులో కలిసి ఉన్నాయి. ఈ సీజన్ ఆధారిత అవకాశాలు 2025 నాటికి దేశంలో 1 మిలియన్ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే అమెజాన్ ఇండియా నిబద్ధతకు మరొక ముందడుగు అని చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్: ఆర్మీవార్‌ కాలేజ్‌లో 30 సైనిక అధికారులకు కరోనా