Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విక్స్ మాత్ర ఇప్పుడు పెద్దదైంది: రణ్‌వీర్ సింగ్

Ranveer singh

ఐవీఆర్

, శుక్రవారం, 14 జూన్ 2024 (18:19 IST)
పవర్‌హౌస్ బ్రాండ్ అంబాసిడర్ రణవీర్ సింగ్ నేడు, విక్స్‌కు సంబంధించిన ‘అతి పెద్ద వార్త’ ‘విక్స్ మాత్ర ఇప్పుడు మరింత పెద్దదైంది’ అని ప్రకటించి, రెండు దశాబ్దాల అనంతరం ఐకానిక్ త్రిభుజాకార విక్స్ కాఫ్ డ్రాప్స్ మొట్టమొదటి డబుల్ పవర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ఆవిష్కరించారు. సాహిల్ సేథీ, కేటగిరీ లీడర్, కన్స్యూమర్ హెల్త్‌కేర్, P&G ఇండియా మాట్లాడుతూ, “విక్స్ మాత్రతో ఖిచ్ ఖిచ్‌ను దూరం చేసుకోండి’ అనే విక్స్ కాఫ్ డ్రాప్స్ ఐకానిక్ బ్రాండ్ జింగిల్ ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఖిచ్ ఖిచ్ రహిత స్వరంలో మాట్లాడేందుకు 1960 నుంచి భారతీయులకు సహాయపడిన వ్యామోహాన్ని తక్షణమే కలిగిస్తుంది. మా వినియోగదారులకు ఏమి కావాలో ఎల్లప్పుడూ వారి అభిప్రాయాలను వినడం ద్వారా, మా ఉత్పత్తి సూత్రీకరణలు మరియు ప్యాకేజింగ్‌లో ఈ అభిప్రాయాలను పొందుపరచడం ద్వారా ఈ వారసత్వాన్ని పెంపొందించుకునేందుకు ఉన్నాము.
 
కొన్ని దశాబ్దాల అనంతరం మా అతిపెద్ద వార్త - విక్స్ డబుల్ పవర్ కాఫ్ డ్రాప్స్‌ను విడుదల చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది భారతదేశంలో డబుల్ పవర్ కాఫ్ డ్రాప్స్, మా మొట్టమొదటి ఐకానిక్ త్రిభుజాకార విక్స్ కాఫ్ డ్రాప్స్ పవర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్. గొంతులో చికాకు, దగ్గు లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడే పెద్ద పరిమాణంలో, వినియోగదారులు ఇష్టపడే కాఫ్ డ్రాప్స్ అవసరంపై వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేశాము. మా కొత్త ‘విక్స్ డబుల్ పవర్ కాఫ్ డ్రాప్స్’ అనేది పెద్ద మాత్రగా, చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది. ఇప్పుడు విక్స్ మాత్ర వేసుకోండి. చక్కని ఉపశమనాన్ని పొందండి’’ అని పేర్కొన్నారు.
 
విక్స్ కాఫ్ డ్రాప్స్‌తో తన అనుబంధం గురించి పవర్‌హౌస్ రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, “విక్స్ మాత్ర మన సంస్కృతిలో ఒక భాగం. ఇది ఎల్లప్పుడూ ఖిచ్-ఖిచ్ లేకుండా తక్షణమే ఉపశమనాన్ని అందించే ఉత్పత్తి! విక్స్ వంటి దిగ్గజ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. కొత్త డబుల్ పవర్డ్ కాఫ్ డ్రాప్స్ పనితీరును అందంగా, చమత్కారంగా వివరిస్తూ టీవీసీ నాకు సంతోషాన్ని కలిగించింది. దీన్ని ప్రేక్షకులు చిరునవ్వుతో ఈ సందేశాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే...