Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లికాబోతున్న దీపికా పదుకొణె - సెప్టెంబరులో డెలివరీ...

Advertiesment
deepika padukone - ranveer singh

వరుణ్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (11:56 IST)
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, రణ్‌వీర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపికా గర్భందాల్చింది. ఈ విషయాన్ని ఆమె గురువారం తన ఇన్‌స్టా వేదిక ద్వారా వెల్లడించింది. వచ్చే సెప్టెంబరు నెలలో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు తెలిపింది. ఈ బాలీవుడ్ హీరో, హీరోయిన్లు గత 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. తల్లిదండ్రులు కాబోతున్న దీపిక, రణ్‌వీర్‌లకు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
కాగా, గత 2013లో వచ్చిన "రామ్ లీలా" సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో నిమగ్నమయ్యారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. కేరీర్ పరంగా ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నప్పటికీ అది తమ కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ, తనకు రణ్‌వీర్‌కు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. పిల్లలతో తమ కుటుంబాన్ని పరిపూర్ణ చేసుకునే ఆ క్షణం కోసం తాము ఆత్రుతతగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. తమ పిల్లల్ని సెలెబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా సాధారణంగా పెంచాలని భావిస్తున్నట్టు వారిద్దరూ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్లామర్ రోల్స్ కు ఇంకా టైం రాలేదంటున్న అనన్య నాగళ్ళ