Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వార్మోరా గ్రానిటో రూ. 300 కోట్ల పెట్టుబడి: 1200 మందికి ఉద్యోగావకాశాలు

వార్మోరా గ్రానిటో రూ. 300 కోట్ల పెట్టుబడి: 1200 మందికి ఉద్యోగావకాశాలు
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:58 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ టైల్‌, బాత్‌వేర్‌బ్రాండ్‌ వార్మోరా గ్రానిటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ రెండు అత్యాధునిక హైటెక్‌ ప్లాంట్‌లను గుజరాత్‌లోని మోర్బీ వద్ద ఏర్పాటుచేసింది. దాదాపు 300 కోట్ల రూపాయలను రోజుకు 35వేల చదరపు మీటర్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ ఫార్మాట్‌ జీవీటీ టైల్స్‌ విభాగపు ప్లాంట్‌లలో పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్లాంట్‌లు ఏప్రిల్‌ 2021 నాటికి వాణిజ్య కార్యక్రమాలను ఆరంభించడంతో పాటుగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 1200 మందికి ఉపాధిని సైతం అందించనున్నాయి. తమ 25 సంవత్సరాల ఆవిష్కరణ, రూపకల్పన, సాంకేతికతతో కంపెనీ రాబోయే 2-3 సంవత్సరాలలో 1600 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
 
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వర్ట్యువల్‌గా ఈ ప్లాంట్‌ల భూమి పూజ కార్యక్రమాలను గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌భాయ్‌ రూపానీ చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ పరిశ్రమలు మరియు గనుల అదనపు ముఖ్య కార్యదర్శి ఎంకె దాస్‌, ఐఏఎస్‌ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భావేష్‌ వార్మోరా, ఛైర్మన్‌ వార్మోరా గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘విశ్వసనీయత, ఆవిష్కరణ, నాణ్యత, రూపకల్పన, సాంకేతికత పరంగా నమ్మకమైన సంస్థగా వార్మోరా బలీయమైన గుర్తింపును పొందింది. ఎగుమతుల మార్కెట్‌ నుంచి సంస్థ అందుకుంటున్న డిమాండ్‌ను ఈ ప్రతిపాదన విస్తరణతో అందుకోవడంతో పాటుగా దేశీయ మార్కెట్‌లకు సైతం మరింత వేగంగా చేరుకోగలం’’ అని అన్నారు.
 
భారతదేశంలో అగ్రశ్రేణి టైల్‌,బాత్‌వేర్‌ బ్రాండ్‌గా వార్మోరా గ్రానిటో నిలిచింది. కంపెనీకి దేశవ్యాప్తంగా 11 ప్లాంట్స్‌ ఉన్నాయి. రోజుకు 1.1 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం వీటికి ఉంది.  2020 ఆర్థిర సంవత్సరంలో కంపెనీ 1100 కోట్ల రూపాయల అమ్మకాలను నమోదుచేసింది. ‘‘ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి నమోదుచేయగలమని అంచనా వేస్తున్నాం. రాబోయే 2–3 సంవత్సరాలలో 1600 కోట్ల రూపాయల రెవిన్యూను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. అలాగే 100కు పైగా దేశాలకు ఎగుమతులు చేయడంతో పాటుగా తమ షోరూమ్‌ల సంఖ్యను 320కు చేర్చనుంది’’ అని భావేష్‌ వార్మోరా అన్నారు.
 
వార్మోరా గ్రూప్‌ ఫౌండర్‌ రమణ్‌భాయ్‌ వార్మోరా మాట్లాడుతూ ‘‘మోర్బీలో 1994లో ఒ చిన్న యూనిట్‌గా ఆరంభమై నేడు దేశంలోనే సుప్రసిద్ధ బ్రాండ్‌గా నిలువడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు’’ అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలం గూటికి రాములమ్మ?