భారతదేశంలో అతి పెద్ద బీ2బీ ఈ కామర్స్ వేదిక ఉడాన్ నేడు తమ సరఫరా చైన్, లాజిస్టిక్స్ సామర్థ్యంను విస్తరించినట్లుగా వెల్లడించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు ఉడాన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా సేవలనందించనున్నట్లు వెల్లడించింది. ఉడాన్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా 10 మిలియన్ చదరపు అడుగుల వేర్‌హౌస్ ప్రాంగణాలను కలిగి ఉంది. ఈ వేర్‌హౌస్ సామర్థ్యం దాదాపు 175 ఫుట్‌బాల్ ఫీల్డ్స్, 230 ఎకరాల ఓపెన్ స్పేస్‌కు సమానం. సామర్ధ్య విస్తరణ, నూతన వేర్‌హౌస్‌ల జోడింపు ద్వారా ఈ మైలురాయి చేరిక సాధ్యమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంస్ధకు 200 వేర్‌హౌస్‌లు ఉన్నాయి.
ఈ విస్తరణ ఉడాన్ ఎక్స్‌ప్రెస్‌ను దేశంలో అతిపెద్ద సంఘటిత సంస్థగా సరఫరా చైన్, లాజిస్టిక్స్ బీ2బీ ఈ-కామర్స్‌లో నిలుపుతుంది. ఉడాన్ ఇప్పుడు ప్రతినెలా 900కు పైగా నగరాలలో 12000కు పైగా పిన్‌కోడ్స్‌కు 45 లక్షల షిప్‌మెంట్స్‌ను ఉడాన్ ఎక్స్‌ప్రెస్ యొక్క విస్తృతశ్రేణి సరఫరా చైన్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ద్వారా చేస్తుంది. చిరు వ్యాపారులు, బ్రాండ్లు, రిటైలర్లు, కెమిస్ట్‌లు, కిరాణా షాపులు, తయారీదారులు మరీ ముఖ్యంగా టియర్ 2, 3 పట్టణాలకు చెందిన వారు ఈ భారీ వేర్‌హౌసింగ్ ప్రాంగణం, విస్తారమైన పంపిణీ నెట్‌వర్క్ ద్వారా లబ్ది పొందుతున్నారు.
ఈ మైలురాయి చేరికపై సుజీత్ కుమార్, కో–ఫౌండర్, ఉడాన్ మాట్లాడుతూ ప్రపంచశ్రేణి, సాంకేతిక ఆధారిత, అందుబాటు ధరలలోని సరఫరా చైన్, లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ-కామర్స్ వ్యాప్తి ప్రయోజనాలు ఇప్పుడు భారత్‌లోని చిరు వ్యాపారులకు సైతం చేరువవుతాయి.
తాజా సామర్థ్యంను 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచడం ద్వారా సౌకర్యవంతమైన ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్,వేగవంతమైన మరియు ఆధారపడతగిన డెలివరీ సైకిల్, అత్యుత్తమ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ చేయడానికి వినియోగదారులకు సాధ్యం కావడంతో పాటుగా లాభదాయకతను వృద్ధి చేసుకోవడమూ సాధ్యమవుతుంది. రాబోయే 7-8 సంవత్సరాలలో మా సామర్థ్యంను 50 మిలియన్ చదరపుఅడుగులకు విస్తరించనున్నాం అని అన్నారు.