Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్నోవా హైక్రాస్ ZX, ZX (O) గ్రేడ్‌ల కోసం బుకింగ్‌ను తిరిగి ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటర్

Innova Hycross

ఐవీఆర్

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (22:14 IST)
ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్‌లను తిరిగి ప్రారంభించినట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రకటించింది. విడుదల చేసినప్పటి నుండి (నవంబర్ 2022), ఇన్నోవా హైక్రాస్ అపూర్వ స్థాయిలో కస్టమర్ స్పందనను అందుకుంది. సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వేరియంట్ అలాగే గ్యాసోలిన్ వేరియంట్ రెండింటిలోనూ లభ్యమయ్యే వైవిధ్యమైన ఇన్నోవా హైక్రాస్, దాని ఆకర్షణీయత, అధునాతన సాంకేతికత, సౌలభ్యం, భద్రతా లక్షణాలు, డ్రైవింగ్‌లో థ్రిల్ కోసం ఎక్కువ మంది కోరుకుంటున్నారు.
 
అధిక డిమాండ్ పరిస్థితుల కారణంగా, టాప్ ఎండ్ గ్రేడ్‌ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కాలంలో, ఇన్నోవా హైక్రాస్ యొక్క ఇతర గ్రేడ్‌లు, హైబ్రిడ్, గ్యాసోలిన్ రెండింటికీ బుకింగ్‌లు నిరాటంకంగా కొనసాగాయి. మెరుగైన సరఫరాతో, వెయిటింగ్ పీరియడ్ తగ్గించబడింది. ఇన్నోవా హైక్రాస్ టాప్ ఎండ్ గ్రేడ్‌ల బుకింగ్‌లు ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి.
 
శ్రీ శబరి మనోహర్- వైస్ ప్రెసిడెంట్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్-టయోటా కిర్లోస్కర్ మోటర్ మాట్లాడుతూ, “ఇన్నోవా హైక్రాస్, యొక్క టాప్-ఎండ్ గ్రేడ్‌- ZX, ZX (O) ల కోసం బుకింగ్‌ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇన్నోవా హైక్రాస్ అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా మారింది, దాని సాటిలేని సౌలభ్యం, అధునాతన సాంకేతికత, బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్, డిజైన్‌తో ఇన్నోవా హైక్రాస్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌లను నిర్దేశించింది.
 
తాత్కాలికంగా బుకింగ్‌లు నిలిచిపోయిన సమయంలో మా విలువైన కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఇన్నోవా హైక్రాస్ టాప్-ఎండ్ గ్రేడ్‌ల బుకింగ్‌ల పునఃప్రారంభం మా కస్టమర్ల డ్రైవింగ్ అనుభవాలను మరింత మెరుగుపరుస్తుందని, వారి మొబిలిటీ ఆకాంక్షలను నెరవేరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభం మొదటి త్రైమాసికంలో 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరిక