Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుజు మోటర్స్‌ ఇండియా వద్ద టాప్‌ మేనేజ్‌మెంట్‌ మార్పు

Mittal
, మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (23:28 IST)
ఇసుజు మోటర్స్‌ లిమిటెడ్‌, జపాన్‌కు పూర్తి అనుబంధ సంస్ధ ఇసుజు మోటర్స్‌ ఇండియా (ఐఎంఐ), తమ టాప్‌ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన మార్పులను వెల్లడించింది. ఇసుజు మోటర్స్‌ ఇండియా(ఐఎంఐ) అధ్యక్షునిగా శ్రీ వతరు నకానో నుంచి బాధ్యతలను శ్రీ రాజేష్‌ మిట్టల్‌ స్వీకరించారు. ఇసుజు మోటర్స్‌ ఇండియా (ఐఎంఐ)కు నేతృత్వం వహిస్తోన్న మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి శ్రీ రాజేష్‌ మిట్టల్‌. ఏప్రిల్‌2023 నుంచి ఇసుజు వియాత్నం కార్యకలాపాలకు హెడ్‌గా నూతన బాధ్యతలను శ్రీ వతరు నకానో బాధ్యతలు చేపట్టనున్నారు.
 
శ్రీ రాజేష్‌ మిట్టల్‌, టాప్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో ఇసుజు ఇంజినీరింగ్‌ బిజినెస్‌ సెంటర్‌ ఇండియా (ఐఈబీసీఐ) అధ్యక్షునిగా, ఇసుజు మోటర్స్‌ ఇండియా(ఐఎంఐ)   డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఫిబ్రవరి 2022లో చేరారు. అప్పటి నుంచి ఆయన వ్యాపారాన్ని ఏకీకృతం చేయడంపై దృష్టి సారించి, కీలక ప్రాజెక్టులను ముందుకు నడిపిస్తూనే శ్రేష్టత మరియు సహకార సంస్కృతిని పెంపొందించారు.
 
ఇసుజు మోటర్స్‌, జపాన్‌ వద్ద రీజనల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌కు బాధ్యత వహించిన శ్రీ యసుహితో కొండో, ఇప్పుడు ఇసుజు మోటర్స్‌ ఇండియాకు డిప్యూటీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సేల్స్‌ ఆపరేషన్స్‌, వ్యాపార వ్యూహాలపరంగా తన 28 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవాన్ని శ్రీ  కొండో భారతదేశానికి తీసుకురానున్నారు. ఆయన అపార అనుభవం, దేశీయ మరియు ఎగుమతి మార్కెట్‌లలో ఇసుజు వృద్ధిని వేగవంతం చేయడంలో తోడ్పడనుంది. మేనేజ్‌మెంట్‌లో ఈ మార్పులు కంపెనీ యొక్క వ్యాపార ప్రణాళికకు అనుగుణంగా జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా వుండాలి.. బీజేపీది మాది అదే స్టాండ్: పవన్