Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో టీకా కార్యక్రమం: యునైటెడ్ వే ముంబైకి నిధులు సమకూర్చిన కోక-కోలా ఫౌండేషన్

Advertiesment
Coca-Cola Foundation
, గురువారం, 12 ఆగస్టు 2021 (18:08 IST)
మహమ్మారి రెండో వేవ్ ఏర్పరిచిన అమానవీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు యునైటెడ్ వే ముంబైకి కోక-కోలా ఫౌండేషన్ నిధులు సమకూర్చింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, టీకా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని అధికం చేసేందుకు, దేశంలో 10 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో సురక్షిత కిట్లను అందించేందుకు యునైటెడ్ వే ముంబై ప్రయత్నిస్తోంది.
 
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా టీకా కార్యక్రమం జోరందుకున్న నేపథ్యంలో4400కు పైగా కమ్యూనిటీలు, గ్రామాల్లో ప్రజల్లో టీకాపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ #StopTheSpreadకు తోడ్పడనుంది. అదనంగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అందరికీ టీకా కార్యక్రమానికి మద్దతుగా దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 440 టీకా కేంద్రాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. కోక-కోలా ఫౌండేషన్ చేపట్టిన స్టాప్ ది స్ప్రెడ్ వరల్డ్ వైడ్ ఫండ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. టీకా పంపిణి, కోవిడ్ సురక్షిత కిట్లు (పీపీఈ- మాస్క్‌లు, గ్లోవ్స్, శానిటైజర్స్), టీకాలపై, పరిశుభ్రంగా ఉండే విధానాలపై అవగాహన పెంచడం లాంటి వాటి దిశగా ప్రయత్నాలను కేంద్రీకరించడం జరుగుతోంది.
 
#StopTheSpread ఆరంభదశలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, దిల్లీ, హరియాణాలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న టీకా కార్యక్రమానికి మద్దతుగా యునైటెడ్ వే ఆఫ్ ముంబై దేశం లోని మారుమూల ప్రాంతాల్లో టీకా కోసం పౌరులను సమీకరించ నుంది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, టీకా శిబిరాలకు చేరుకునేందుకు మారుమూల ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడం, పీపీఈ కిట్లను సమకూర్చడం ద్వారా శిబిరాల్లో సురక్షితను పెంచడం లాంటి కార్యక్రమాలను చేపడుతోంది. అదనంగా, ప్రస్తుతం ఉన్న టీకా కేంద్రాలకు ప్రజ లను అనుసంధానం చేయడంలో కూడా ఇది సాయపడుతోంది. రిజిస్ట్రేషన్ కు వీలు కల్పిస్తోంది. సురక్షిత ఉప కరణాలు సమకూర్చడం ద్వారా ప్రస్తుతం ఉన్న టీకా కేంద్రాలను బలోపేతం చేస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో యునైటెడ్ వే ముంబై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం వీటిలో ఉన్నాయి. రాష్ట్రంలో సుమారుగా 3.9 లక్షల మందిపై సానుకూల ప్రభావం కనబర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీనికింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60 టీకా కేంద్రాలు, 600 గ్రామాలు, కమ్యూనిటీలు కవర్ కానున్నాయి. సుమారుగా 65 వేల మంది ప్రజలకు విజయవంతంగా రిజిస్ట్రేషన్లు కల్పించనుంది. 3.5 లక్షల మందికి పైగా అవగాహన కల్పించడం, 80 వేల మంది ప్రజలను ఒక్కొ క్కరిగా వారి ఆరోగ్యవిషయంలో విచారించడం, రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 30 వేల మందికి రవాణా సదుపాయాల కల్పనలో సహకరించడం వంటివి దీనిలో ఉన్నాయి.
 
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంపై, మనలో ప్రతీ ఒక్కరం ముందడుగు వేయాల్సిన అవసరంపై టీసీసీఎఫ్ ప్రెసిడెంట్ సాడియామ్యాడ్స్ బిజెర్గ్ మాట్లాడుతూ, ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు మా వనరులు ఉపయోగించడం మాకెంతో గర్వకారణం. భారతదేశంలో యునైటెడ్ వే ముంబై చేపట్టిన కార్యక్రమాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ ఉమ్మడి ప్రయత్నంతో, అందరి సహకారం తో మనం ఈ కష్టకాలం నుంచి బయటపడగలుగుతామనే భావిస్తున్నాం’’ అని అన్నారు.
 
యునైటెడ్ వే ముంబై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జార్జ్ అయికారా మాట్లాడుతూ, ‘‘అనుకోని ఆరోగ్య సంక్షోభాన్ని దుర్కోవడంలో దేశానికి మద్దతుగా ఉండేందుకు టీకాలపై అవగాహన కల్పించడం, అపోహలను దూరం చేయ డం, టీకా కేంద్రాల వద్ద వ్యాధి నివారణ విధానాలను అనుసరించడం ముఖ్యం. అవగాహన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టీకా కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. కోక-కోలా ఫౌండేషన్ నుంచి అందుతున్న ఆర్థిక సాయం మాకు మరింత మందికి టీకాలు వేయించేందుకు, వ్యాధి మరింత మందికి విస్తరించకుండా అడ్డు కునేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హుజూరాబాద్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?