పసిబిడ్డ తనను వేధించడంతో ఆగ్రహంతో ఆమె తల్లి కొట్టడంతో రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇది ప్రమాదవశాత్తూ, ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్య కాదని ఆ కుటుంబం పేర్కొంది.
మృతుడిని కుటుంబసభ్యులు తొందరగా ఖననం చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని త్వరలో అధికారికంగా అరెస్టు చేస్తామని తగిన ప్రక్రియను అనుసరిస్తామని పోలీసు ధృవీకరించారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.. నిందితురాలు నేహా సోని (22) తన ఆటోరిక్షా డ్రైవర్ సోను కుమార్ (32)తో కలిసి విరార్ తూర్పులోని ఫూల్‌పాడాలో నివసించింది. నేహా 7 నెలల గర్భవతి. ఇంకా ఆమెకు ఇద్దరు పిల్లలు వున్నారు.
శనివారం, 2 ఏళ్ల నాన్సీ చెల్లెలితో ఆడుకుంటున్నప్పుడు, వారు తల్లి వద్దకు వెళ్లారు. అప్పుడు ఆమె ఇంటి పనుల్లో బిజీగా ఉంది. కోపంతో, ఆమె నాన్సీని కొట్టింది. దీంతో నాన్సీ అపస్మారక స్థితిలోకి చేరింది. స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లే లోపు నాన్సీ మరణించింది. వెంటనే ఖననం చేశారు.
శనివారం పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ దాఖలు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. సోమవారం పోస్ట్‌మార్టంలో మైనర్ కుమార్తె తల, కడుపుపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఆమె 2 సంవత్సరాల చిన్నారిని హత్య చేసినందుకు పోలీసులు ఆమెను ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.