Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గరుడ ఏరో స్పేస్‌తో చేతులు కలిపిన స్విగ్గీ.. ఆకాశమార్గంలో డెలివరీ

Swigy Garuda
, సోమవారం, 2 మే 2022 (21:08 IST)
Swiggy Garuda
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గరుడ ఏరో స్పేస్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా సిగ్నల్స్ ద్వారా స్విగ్గీ త్వరలోనే మీకు ఆకాశ మార్గాన గ్రోసరీలను డెలివరీ చేయనుంది.

 
ఇందుకోసం స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో తన ప్రాజెక్టు పైలట్ సేవల కోసం నాలుగు డ్రోన్ స్టార్టప్‌లను కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసింది. షార్ట్ లిస్టు అయిన కంపెనీలు గరుడ ఏరోస్పేస్, స్కైఎయిర్ మొబిలిటీ, ఏఎన్‌ఆర్ఏ ప్లస్ టెక్ఈగల్ కన్సార్టియా, మారుత్ డ్రోన్‌టెక్‌లున్నాయి.

 
ఈ డీల్ ద్వారా స్విగ్గీ తన  ఇన్‌స్టా‌మార్ట్ కోసం డ్రోన్లను వాడేందుకు పైలట్ సేవలను మే నుంచి ప్రారంభించనుంది. డ్రోన్ కామన్ పాయింట్ వద్దకు స్టాక్‌ను డెలివరీ చేస్తే... వాటిని కామన్ పాయింట్ నుంచి డెలివరీ పార్టనర్లు పికప్ చేసుకుని కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తారని స్విగ్గీ తన పోస్టులో పేర్కొంది.

 
డార్క్ స్టోర్లు అంటే సెల్లర్ల లొకేషన్ నుంచి కస్టమర్ల అడ్రస్‌కు దగ్గర్లో ఒక కామన్ పాయింట్ వద్దకు గ్రోసరీలను స్విగ్గీ డెలివరీ చేయనుంది. డార్క్ స్టోర్ అనేవి చిన్న ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్. దీన్ని ఆల్ట్రా ఫాస్ట్ డెలివరీల కోసం వాడతారు. ఇకపోతే.. డ్రోన్ డెలివరీలపై గరుడ ఏర్ స్పేస్ సీఈవో అగ్నిశ్వర్ జయప్రకాష్ మాట్లాడుతూ.. నగరాల్లో రద్దీ ఎక్కువ వుండటం వల్ల డ్రోన్ డెలివరీలపై కన్నేశామని చెప్పారు.

 
ఈ సేవల్లో స్టార్టప్‌ కంపెనీలతో అధునాతన గరుడ ఏరోస్పేస్ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. డెలివరీల సమయాన్ని తగ్గించడం కొరకు ఆకాశమార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. గుర్గావ్, చెన్నైలో గరుడ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లు వున్నాయని అగ్నిశ్వర్ జయప్రకాష్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో రాసలీలలు.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది..