Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణాలలో 350 మంది ఉద్యోగులను నియమించుకోనున్న శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Advertiesment
ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణాలలో 350 మంది ఉద్యోగులను నియమించుకోనున్న శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:30 IST)
శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ (శ్రీరామ్‌ సిటీ) ప్రమోట్‌ చేస్తున్న, ముంబై కేంద్రంగా కలిగిన అందుబాటు ధరలోని గృహ ఋణ విభాగ కంపెనీ, శ్రీరామ్‌ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ తమ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో 350 మందిని ఉద్యోగాలలోకి తీసుకోవడానికి ప్రణాళిక చేసింది. ఈ కంపెనీ తమ పంపిణీని గృహ ఋణాల కోసం మరింతగా విస్తరించడానికి ప్రణాళిక చేసింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల(ఏపీటీజీ)లో శ్రీరామ్‌ సిటీ 178 శాఖలను 2021 సంవత్సరాంతానికి తెరువడానికి  ప్రణాళిక చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఏపీటీజీలో 11 సొంత శాఖలు ఉండటంతో  పాటుగా నిర్వహణలోని ఆస్తులు (ఏయుఎం) 500 కోట్ల రూపాయలుగా ఈ ప్రాంతంలో ఉన్నాయి.
 
శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తమ విస్తృత శ్రేణి శాఖల నెట్‌వర్క్‌పై ఆధారపడటంతో పాటుగా తమ మాతృసంస్థ శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ వినియోగదారులపై ఆధారపడి వృద్ధిని వేగవంతం చేయనుంది. ఈ కంపెనీ కస్టమైజ్డ్‌ గృహ ఋణ పరిష్కారాలను గ్రూప్‌ కంపెనీ యొక్క వినియోగదారులకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తుంది. మరింతగా అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ కార్యక్రమం చేత ఇది నడుపబడుతుంది. ఈ కంపెనీ ఈ కార్యక్రమాన్ని ‘గృహ పూర్తి’గా వ్యవహరిస్తుంది. వినియోగదారులకు తమ మొదటి సొంత ఇంటి కలను సాకారం చేయనుంది.
 
గృహ పూర్తి, ఏపీటీజీలో ఇప్పుడు తొలి దశలో ఉంది. తెలంగాణాలో ఇప్పటికే 50కు పైగా శాఖలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కంపెనీ రాబోయే సంవత్సర కాలంలో ఏపీటీజీ నుంచి ప్రతి నెలా 100 కోట్ల రూపాయల విలువైన ఋణాలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ యొక్క ఏయుఎం 4వేల కోట్ల రూపాయలుగా నిలువడంతో  పాటుగా ప్రస్తుతం దీనిలో  ఏపీటీజీ వాటా 13%గా ఆగస్టు 2021 నాటికి ఉంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో 84 శాఖలను 2022 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసానికి సంస్థ కలిగి ఉంది.  హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని వ్యక్తులకు చేసిన ఋణ వితరణ 5,730 కోట్ల రూపాయలుగా ఉండగా, తెలంగాణాలో 17,970 కోట్ల రూపాయలుగా 2020 ఆర్ధిక సంవత్సరంలో ఉంది. ట్రెండ్స్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ పేరిట ఎన్‌హెచ్‌బీ విడుదల చేసిన నివేదికలో ఇది ప్రదర్శితమైంది.
 
ఈ హైరింగ్‌ ప్రణాళికలను గురించి శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ రవి సుబ్రమణియన్‌ మాట్లాడుతూ ‘‘ అందుబాటు  ధరల్లోని గృహ ఋణ విభాగంలో శక్తివంతమైన వృద్ధి కనిపిస్తుంది మరియు మా వ్యూహం ఇప్పుడు ప్రాంతీయ మార్కెట్‌లలో మా ఉనికిని బలోపేతం చేయడంపై ఉంది. ఏపీటీజీ తో దీనిని ఆరంభిస్తున్నాం. ఏపీటీజీలో మార్కెట్‌ సామర్థ్యం  గణనీయంగా ఉంది. ఈ ప్రాంతంలో శ్రీరామ్‌ సిటీ శాఖల నెట్‌వర్క్‌ శక్తిని వినియోగించుకోవాలనుకుంటున్నాం.
 
ఏపీటీజీలో రాబోయే సంవత్సర కాలంలో అందుబాటు ధరలలోని గృహ ఋణ విభాగంలో అతి పెద్ద సంస్థగా నిలువాలని లక్ష్యంగా చేసుకున్నాం. మా రిటైల్‌ ఉనికిని మరింతగా విస్తరించడంతో పాటుగా నెలకు 100 కోట్ల రూపాయల ఋణ వితరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఋణాల రమారమి టిక్కెట్‌ సైజ్‌ 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలలో ఉండనున్నాయి. వైవిధ్యమైన రిస్క్‌, మా ప్రస్తుత గ్రూప్‌ వినియోగదారులను చక్కగా మిళితం చేయడం ద్వారా గ్రాన్యులర్‌ బుక్‌ రూపొందించాలనే మా వ్యూహాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెమెరామెన్‌ను రక్షించబోయి మంత్రి మృతి.. నీటిలో పడిపోతే..?