Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెలకు రూ. 1411లు పెట్టుబడిలో రూ.35లక్షలు పొందవచ్చు..

Advertiesment
postal department
, గురువారం, 12 మే 2022 (11:57 IST)
పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా... అయితే పోస్టాఫీసులో ఈ స్కీమ్‌ను ఎంచుకోండి. ఎటువంటి రిస్క్ లేకుండా భవిష్యత్తు లాభాలకు పోస్ట్ ఆఫీస్‌ ఉత్తమమైన ఆప్షన్. తాజాగా తపాలా శాఖ గ్రామ సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఇదే ఉత్తమం. రూ. 1411 నెల నెల పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో 35 లక్షల రూపాయలు పొందవచ్చు.
 
పథకం కనీస వయస్సు 19, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. ఈ పథకంలో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో ప్రీమియంలను ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర ప్రాతిపదికన చెల్లించవచ్చు. 
 
దీనిలో లోన్ సదుపాయం కూడా ఉంది. అయితే, స్కీమ్‌లో 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రోజు నుండి, 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు.
 
19 సంవత్సరాల వయస్సు గలవారు గ్రామ సురక్ష పాలసీలో 10 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలవారీ ప్రీమియం 55 ఏళ్లకు రూ.1,515, 58 ఏళ్లకు రూ.1,463, 60 ఏళ్లకు రూ.1,411గా వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంగ్ కింగ్ ఎయిర్‌ పోర్టులో తప్పిన పెను ప్రమాదం