Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మారథాన్ ట్రోఫీని గెలుచుకున్న ఆప్టమ్

Advertiesment
image
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (21:51 IST)
1005 కంటే ఎక్కువ మంది ఆప్టమ్ ఉద్యోగులు 27 ఆగస్టు 2023 ఆదివారం నాడు హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. ఎనిమిదవ సంవత్సరం, యునైటెడ్ హెల్త్ గ్రూప్ (NYSE: UNH) యొక్క ఆరోగ్య సేవల వ్యాపారం అయిన ఆప్టమ్ (Optum) గరిష్ట ఉద్యోగుల భాగస్వామ్యంకు ఈ ట్రోఫీ లభించింది. ఆప్టమ్ బృందంలో 841 పురుషులు, 164 మహిళా రన్నర్లు ఉన్నారు, వీరు నలభై రెండు కిలోమీటర్ల పూర్తి మారథాన్, ఇరవై ఒక్క కిలోమీటర్ల హాఫ్ మారథాన్, అలాగే పది- ఐదు కిలోమీటర్ల రేసుల్లో పాల్గొన్నారు.
 
ప్రతి సంవత్సరం, ఈ కార్యక్రమానికి సిద్ధం కావడానికి, ఆప్టమ్‌లోని హోలిస్టిక్ ఎంప్లాయి వెల్‌బీయింగ్ ప్రోగ్రామ్, లైవ్‌వెల్, ఉద్యోగుల ఫిట్‌నెస్ ప్రయాణంలో పోషకాహారం, ఫిట్‌నెస్ నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పరుగు పై తగిన కోచింగ్‌ కూడా అందిస్తూ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది, మద్దతు ఇస్తుంది. ఆగస్టు 6, 2023న ప్రాక్టీస్ రన్‌ను సైతం ఆప్టమ్ స్పాన్సర్ చేసింది.
 
ఉద్యోగుల భాగస్వామ్యం, ఈ విజయంపై ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ - ఇండియా ఉమా రత్నం కృష్ణన్ మాట్లాడుతూ, “అధిక సంఖ్యలో పాల్గొని ట్రోఫీని తిరిగి పొందినందుకు ఆప్టమ్ టీమ్‌కు అభినందనలు. మా ఉద్యోగులతో సహా మేము సేవలందిస్తున్న వారందరికీ మెరుగ్గా పనిచేసే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలనే మా ఏకీకృత లక్ష్యానికి ఈ అవార్డు నిదర్శనం. లైవ్‌వెల్‌తో, మేము ఉద్యోగుల మొత్తం ఆరోగ్యంను నియంత్రించడానికి అవసరమైన వనరులను మేము వారికి అందిస్తున్నాము. వచ్చే ఏడాది మరింత ఎక్కువ మంది ఈ రన్లో పాల్గొనటానికి తిరిగి రావాలని, శ్రద్ధ వహించే, కలిసికట్టుగా వృద్ధి చెందే ప్రయాణాన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అరెస్టు