Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ చిన్న వ్యాపారులు ఎక్కువమంది వెబ్ సైట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి: గోడాడీ స్టడీ 2023

Business
, గురువారం, 24 ఆగస్టు 2023 (20:21 IST)
ప్రపంచంలో అగ్రగామి డిజిటల్ సంస్థ గోడాడీ. అలాగే వ్యవస్థాపకులకు ఎంతగానో ఉపయోగపడే సంస్థ ఇది. ఇలాంటి సంస్థ ఇవాళ GoDaddy-2023 డేటా అబ్జర్వేటరీ నుండి రెండో సెట్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. భారతదేశంలో ఉన్న చిన్న వ్యాపారాల్లో ఎక్కువమంది తమ వెబ్‌సైట్ ద్వారా మార్కెటింగ్ కార్యకలాపాలు అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సర్వే తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 77%, వెబ్‌సైట్లో అద్భుతమైన డిజైన్ రూపొందించడం ద్వారా 70%, సెర్చ్ ఇంజిన్‌లలో కంపెనీని మెరుగ్గా ఉంచడం ద్వారా 70%, వారి పేజీల ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా 68% సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
 
అంతేకాకుండా, GoDaddy డేటా అబ్జర్వేటరీ ప్రకారం భారతదేశంలో వెబ్‌సైట్ లేని వ్యాపారాలు 48% ఉన్నాయని తెలిపింది. రాబోయే మూడు నెలల్లో కచ్చితంగా ఒక దాన్ని నిర్మించుకోవాలని 43% మంది ప్లాన్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా మరియు సంపూర్ణ డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడం ద్వారా వెబ్ సైట్ యొక్క నిరంతర ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో సర్వే చేసిన చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ సేల్స్ ఛానెల్‌ కోసం 65% మంది, మొబైల్ అప్లికేషన్‌ కోసం 60% మంది ఆసక్తిగా ఉన్నారు.  
 
భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల బలమైన ఆన్‌లైన్ నెట్ వర్క్ ని కలిగి ఉండటం వల్ల వ్యాపారాలకు చాలా ఉపయోగాలున్నాయి. దీనికి అనుగుణంగా, భారతీయ వ్యాపారులు తమ ఉత్పత్తులను, సేవలను 73% మెరుగ్గా ప్రదర్శించడానికి అనుమతించే వెబ్‌సైట్‌ను కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను అంగీకరించారు. ఇది వ్యాపారం యొక్క అవకాశాలను 70 శాతం వరకు పెంచుతుంది. అంతేకాకుండా 69 శాతం కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. మరోవైపు 66% మెరుగైన సహకారాన్ని స్థాపించడంలో సహాయపడుతుంది.
 
సర్వేలో 75 శాతం భారతీయ చిన్న వ్యాపారాలు మార్కెటింగ్ ఆటోమేషన్‌ను స్వీకరిస్తున్నాయని గుర్తించారు. ఇతర దేశాల్లో ఇది కేవలం 57 శాతం మాత్రమే ఉంది. అంటే భారతదేశం దీన్ని అధిగమించిందని సర్వే కనుగొంది. ఈ సందర్భంలో ఇది మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఆటోమేషన్ యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. అంతేకాకుండా, వినియోగదారుల నాలెడ్జ్ విషయానికి వస్తే, భారతీయ చిన్న వ్యాపారాలు ఇతర సర్వే చేయబడిన దేశాల్లోని చిన్న వ్యాపారాల కంటే డేటా విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇది సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి, ఇన్ సైట్స్ ని ప్రభావితం చేయడంలో వారి నిబద్ధతను సూచిస్తుంది.
 
“GoDaddy సర్వే ఫలితాలు భారతీయ చిన్న వ్యాపారాల డిజిటల్ అభివృద్ధిని సగర్వంగా ప్రదర్శించాయి. డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ చిన్న వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. GoDaddy చిన్న వ్యాపారాలను ఉపయోగించడానికి సులభమైన, సరసమైన ఆన్‌లైన్ సాధనాలను అందిస్తుంది. అంతేకాకుండా పోటీ మార్కెట్‌లలో మరింతగా వృద్ధి చెందడానికి అవసరమైన మార్గదర్శకాలకు మద్దతు ఇస్తుంది. వ్యాపార వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ఒకదానికొకటి పూర్తి చేసే విధంగా డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ని మేము అందిస్తాము. తద్వారా కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి మార్కెటింగ్ ఆటోమేషన్‌ను ప్రభావితం చేయడానికి మేము భారతీయ చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాము” అని అన్నారు ఇండియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్, GoDaddy శ్రీ అపూర్వ పల్నిట్కర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెస్: ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద‌పై మాగ్నస్ కార్ల్సన్‌ విజయం.. రన్నరప్‌గా నిలిచిన చెన్నై కుర్రాడు