Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూర్వ ఐఐటియన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నాను అధ్యక్షులుగా నియమించుకున్న నిట్‌ యూనివర్శిటీ

పూర్వ ఐఐటియన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నాను అధ్యక్షులుగా నియమించుకున్న నిట్‌ యూనివర్శిటీ
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:56 IST)
విజ్ఞాన సమాజం కోసం అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణ, సస్టెయినబిలిటీ పరంగా రోల్‌ మోడల్‌గా నిలువాలనే లక్ష్యంతో ఏర్పడిన లాభాపేక్ష లేని నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ నూతన అధ్యక్షునిగా ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నాను  నియమించుకుంది. గతంలో ఐఐటీ ఢిల్లీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌ డీన్‌గా సేవలనందించారాయన.
 
ఐఐటీ ఢిల్లీలో 23 సంవత్సరాల పాటు  ఫ్యాకల్టీ, అడ్మిన్‌స్ట్రేటివ్‌ స్ధానాలను అలరించిన ప్రొఫెసర్‌ ఖన్నా, అక్కడ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ప్రొఫెసర్‌ ఖన్నాను స్వాగతించిన నిట్‌ యూనివర్శిటీ ఫౌండర్‌ శ్రీ రాజేంద్ర ఎస్‌ పవార్‌ మాట్లాడుతూ ‘‘ ప్రొఫెసర్‌ ఖన్నా ఇప్పుడు బాధ్యతలు చేట్టడం ద్వారా ఎన్‌యు ఇప్పుడు మరింతగా పరిశ్రమ అనుసంధానిత, సాంకేతికాధారిత, పరిశోధనల చేత నడుపబడుతున్న సౌకర్యవంతమైన విద్యను అందించగలదు. 
 
గత 18 నెలల కాలలో మహమ్మారి మనందరికీ విద్యావ్యవస్థను, మన ఎస్సెస్‌మెంట్‌  నమూనాలను పునః సమీక్షించుకునే అవకాశం కల్పించింది. ప్రొఫెసర్‌ ఖన్నా మార్గనిర్ధశకత్వంలో, పరిశ్రమ సిద్ధమైన గ్రాడ్యయేట్స్‌ను సృష్టించే భవిష్యత్‌ సిద్ధమైన విద్యను అందించడం కొనసాగించనుంది’’ అని అన్నారు.
 
పూర్వ ఐఐటీయన్‌ ప్రొఫెర్‌ ఖన్నా, తన బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీని కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఐఐటీ కాన్పూర్‌ నుంచి చేశారు. ఆయన పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ను ఇనిస్టిట్యూట్‌ డీ చిమి డెస్‌ సర్ఫేసస్‌ ఎట్‌ ఇంటర్‌ఫేజెస్-సీఎన్‌ఆర్‌ఎస్‌ ముల్హౌస్‌ వద్ద పూర్తి చేయగా, సిడ్నీలోని న్యూసౌత్‌ వేల్స్‌ యూనివర్శిటీలో హానరరీ విజిటింగ్‌ రీసెర్చ్‌ ఫెలోగా సేవలను అందించారు.
 
నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ, ‘‘మా తరంలో అత్యుత్తమ ప్రతిభావంతులు తీర్చిదిద్దిన సంస్థలో చేరడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఎన్‌యు బృందంతో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. యూనివర్శిటీని నూతన శిఖరాలను తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతివేగం.. స్పీడ్‌ గన్‌కు చిక్కిన కలెక్టర్ వాహనం - 23 చలాన్లు