Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

Advertiesment
Minister KTR
వరంగల్ జిల్లా హసన్‌ప‌ర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి. రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మంత్రి కేటిఆర్‌ను కోరింది.

మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు.

ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజుల మొత్తాన్ని బుధ‌వారం అంజలి కుటుంబానికి మంత్రి అందించారు. 
 
ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.

తమ కూతురు ఐఐటీ విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం మంత్రి కేటీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు ఎదుట నిప్పంటించుకున్న మహిళ మృతి