తెలంగాణా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఎవరికైనా ఒక్కటేనని మరోమారు నిరూపించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి వారికి జరిమానాలు విధించడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అధి సాధారణ పౌరుడైనా.. జిల్లా కలెక్టర్ అయినా సరే.. అంతా సమానమేనని రుజువు చేస్తున్నారు.
తాజాగా అధిక వేగంతో వెళ్తూ స్పీడ్ గన్‌కు చిక్కిన ఓ ఉన్నతాధికారి వాహనానికి ఏకం 23 చలాన్లు పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే… జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి గడిచిన రెండేళ్లలో ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్‌కు కాగా… ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు.
ఈ చలానాల మొత్తం రూ.22,100 కాగా.. యూజర్ ఛార్జీలు రూ.805 కలుపుకొని మొత్తం 22,905 కట్టాల్సి ఉంది. ఈ చలానాల్లో సగానికి పైగా హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకే విధించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. కలెక్టర్ వాహనంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వాహనాలపై కూడా చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.